NewsOrbit
రాజ‌కీయాలు సినిమా

రాజకీయాల్లో వైఫల్యంపై చిరంజీవి కామెంట్స్..! సమంత షోలో ఇదే హైలైట్..!!

chiranjeevi comments on his political failure

ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఓ మాట అన్నాడు. ‘ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాలి.. జారిన ప్రతి నోరూ మూసుకోవాలి’ అని. 39 ఏళ్ల తిరుగులేని చిరంజీవి సినీ ప్రస్థానాన్ని.. అందులోనే 9 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కొలమానంగా చూపించదగ్గ డైలాగ్ అది. సినిమాల్లో చిరంజీవిని విమర్శించలేని ఎందరికో.. రాజకీయాల్లోకి వెళ్లి ఆయనే అనేక అవకాశాలు ఇచ్చారు. ఆ కథ అయిపోయింది. కమ్ బ్యాక్ మూవీస్ తో రెండు వరుస 100 కోట్ల కలెక్షన్ల సినిమాలతో తన స్టామినా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నా.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై ఇటివల ఆహా ఓటీటీలో సామాజామ్ షోలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు మెగాస్టార్.

chiranjeevi comments on his political failure
chiranjeevi comments on his political failure

రాజకీయాలపై అభిప్రాయం అనే ప్రస్తావనకు చిరంజీవి తనదైన స్టయిల్లో సమాధానం చెప్పారు. సినిమాల్లో హైట్స్ చూశాను.. రాజీకీయాల్లో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల్లో నా వంతు ప్రయత్నం చేశాను. సినిమా మళ్లీ చేస్తున్నప్పుడు.. ఇది కదా నా సామ్రాజ్యం అనిపించింది. మళ్లీ జన్మంటూ ఉంటూ ఆర్టిస్టుగానే పుడతాను.. అంటూ తన స్టయిల్లో నో అనే సైగ చేశారు. దీంతో మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఒక ఇంటర్వ్యూలో.. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. రేపేం మాట్లాడాలి.. ఏం చేయాలి అనే దానికి ఇంటికొచ్చాక ప్రిపేర్ కావాలి.. రాజకీయాల్లో ఇది కామన్. ఇంటికొచ్చేసరికి పొలిటీషియన్స్, కార్యకర్తలు ఉండేవారు.. కానీ.. సినిమాల్లో ఆ టెన్షన్ ఉండదని అన్నారు.

దీంతో చిరంజీవిలో మళ్లీ రాజకీయాల వైపు మళ్లీ వెళ్లే ఆలోచన లేదని గతంలోనే స్పష్టమైనా మీడియా ఊహాగానాలు, ప్రశ్నలు, పార్టీల నుంచి పిలుపులు.. సహజం. కానీ.. చిరంజీవి రాజకీయ వైకుంఠపాళి చూశారు. సినిమాల్లో ఆయన నిచ్చెనలు ఎక్కితే.. రాజకీయాల్లో పాములు కాటేశాయి. తనదైన సినిమా సామ్రాజ్యంలో తన స్థానం, కుటుంబం నుంచి వారసులు హీరోలుగా ఎదగడం, కుటుంబానికి ఉన్న పేరు, తనకు ఉన్న ప్రతిష్ట అన్నీ గమనించుకున్న చిరంజీవి.. ఇక రాజకీయాలకు స్వస్తి పలకడానికి కారణాలయ్యాయని చెప్పాలి. బిగ్ బాస్ ఫైనల్ లో నాగార్జున.. ‘వరుసగా సినిమాలు చేస్తున్నారు.. మళ్లీ రూలింగ్ మొదలు’ అన్నట్టు.. అసలు చిరంజీవి ఆపిందెక్కడ. టాలీవుడ్ లో ఆయన నెంబర్ వన్ స్థానం ఆయన కోసం అలానే ఉంటే..!

 

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju