Star heroine: ప్రగ్యా జైస్వాల్ అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలయ్య నటించిన ” అఖండ ” సినిమా హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంత పాపులారిటీ దక్కించుకుంది మరి ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా బాలయ్య సరుసున ఏ హీరోయిన్ నటించిన ఆ హీరోయిన్ కి ఫుల్ పాపులారిటీ దక్కుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ విషయంలో కూడా అదే జరిగింది.
గతంలో జై జానకి నాయక లాంటి సినిమాలలో చిన్న పాత్రలలో నటించిన రాణి పాపులారిటీ బాలయ్య సరుసున నటించేటప్పటికీ దక్కింది. ఇక అఖండ సినిమాలో ఈమె యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పొచ్చు. బాలయ్య పక్కన తన అద్భుతమైన నటనతో పోటీ పడింది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించినప్పటికీ బయట మాత్రం చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. 37 ఏళ్ల వయసులో కూడా తన అందంతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
2014లో ” టిట్టూ ఎంబీఏ” సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాదిలో ” డేగ ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అనేక సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పాపులారిటీ రాలేదు. ఇక అఖండ సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ ను చూపించి తనేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో ఈమె అందం అభినయం చూసి స్వయంగా బాలయ్య బాబు ఈమెకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇక తాజాగా అఖండ సీక్వెల్ గా అఖండ 2 రానున్నసంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కి ఎంతవరకు ప్రాముఖ్యత ఇచ్చారో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అందాలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె అందం చూసిన ప్రేక్షకులు..” ఈమెకి 37 ఏళ్లు అంటే అస్సలు నమ్మశక్యం కావడం లేదు. అంత అందంగా ఉంది మరి. ఈమె అందం చూసి కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడతారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.