NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Kota Srinivasarao: ‘మా’పై ‘కోట’ మాటల తూటాలు..! ఎవరిదా ప్యానెల్.. ఎక్కడిది..?

kota srinivasarao comments on maa elections

Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు  Kota Srinivasarao ప్రకాశ్ రాజ్ మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజకీయ ఎన్నికలనే తలపిస్తాయి. ఎన్నికల ముందు ఉన్న తుఫాను తీవ్రత.. తీరం దాటి అల్లకల్లోలం సృష్టించి శాంతించినట్టు.. ‘మా’ ఎన్నికలు తుఫానులా అనిపించినా ఎన్నికలు అయిపోగానే.. టీ కప్పులో తుఫానునే తలపిస్తాయి. మళ్లీ అందరూ కలిసిపోతారు, కలిసికట్టుగా పని చేస్తారు. ఏవో.. చిన్న చిన్న స్పర్ధలు తప్ప అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అయితే.. ఈసారి నాన్ లోకల్ ఇష్యూ ప్రకంపనలు రేపుతోంది. ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేయడం.. ఆయనకు మెగా ఫ్యామిలీ మద్దతు ఉందనే వార్తలు మరింత హీటెక్కిస్తున్నాయి. అయితే.. ప్రకాశ్ రాజ్ పోటీ చేయడం ఇండస్ట్రీ పెద్దలకు ఇష్టం లేదా? అంటే.. కోట శ్రీనివాసరావు మాటలు అలానే అనిపిస్తున్నాయి.

kota srinivasarao comments on maa elections
kota srinivasarao comments on maa elections

‘మా’లో జరుగుతున్న రగడపై ప్రముఖ సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు స్పందించారు. ‘మా ఎన్నికలను అసలు ఎవరు ప్రకటించారు? ఇప్పుడున్న కమిటీ పదవీకాలం పూర్తైందా? వారే ఎన్నికలను ప్రకటించారా? కొత్తగా ఓ ప్యానెల్ అంటూ ప్రకటించారు. ఇదే నాకు కొపం తెప్పించింది. దీనిపై ఇప్పుడు కాదు.. టైమ్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతిచ్చారో లేదో నాకు తెలీదు.. కానీ మా పై నాగబాబు వ్యాఖ్యలు సరికాదు’ అని అన్నారు. దీంతో కోట శ్రీనివాసరావు ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికల తంతపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. నటులకు భాషా బేధం ఉండదు.. నిజమే..! కానీ.. పరిశ్రమకు సంబంధించిన వ్యవస్థలు, పాలకమండలిపై ఇతర భాష నటులకు అధికారం ఉండద్దొనేది చాలామంది ఉద్దేశం.

Read More: Maa Elections: ‘మా’పై ప్రకాశ్ రాజ్ పెత్తనమా..? హిందూ సంఘాల ఆగ్రహం..!

కోట శ్రీనివాసరావు ఎప్పుడూ తెలుగు నటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే అంటారు. ఇదే విషయమై గతంలో ఆయనకూ కొందరికి మధ్య వాదనలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏకంగా ‘మా’ అసోసియేషన్ పగ్గాలు పరభాషా వ్యక్తి చేపడతానంటే కోట ఒప్పుకుంటారని ఊహించలేం. దీంతో కోట వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ప్రకాశ్ రాజ్ పోటీ చేయడంతోనే ఇప్పుడు మా ఎన్నికల్లో కొత్తగా ప్రాంతీయ బేధాలు కూడా వస్తున్నాయి. నటుడు సీవీఎల్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ కూడా ఇదే అంటున్నారు. తెలంగాణ నటులకు అవకాశాలు దక్కడం లేదనీ.. అందుకు అధ్యక్షుడినైతే పోరాడుతానని అంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో ‘మా’ ఎన్నికలు ఎన్ని టర్న్స్ తీసుకుంటాయో చూడాలి..!

 

 

Related posts

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri