రాజ్ అర్జున్ ఈయన డియర్ కామ్రేడ్ సినిమా లో విలన్ పాత్ర పోషించారు. డియర్ కామ్రేడ్ సినిమా చూసిన ప్రతి వ్యక్తికి ఇతని మీద కోపం వచ్చే ఉంటుంది.
ఆయన పోషించిన పాత్ర అలాంటిది మరి. రాజ్ అర్జున్ హిందీలో లో తమిళ్ లో ఎన్నో సినిమాలు చేశారు. హిందీలో ఎంతో విజయవంతమైన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో కూడా దాదాపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఆ పాత్ర లో ఆయన చేసిన నటన తో హిందీ ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యారు.
డియర్ కామ్రేడ్ సినిమా లో లిల్లీ క్రికెట్ నుండి దూరం అవడానికి కారణం అయ్యే పాత్ర రాజ్ అర్జున్ పోషించారు. సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా లో కుటుంబాన్ని మొత్తం అదుపులో పెట్టుకొని, కూతురు సింగర్ అవ్వకుండా అడ్డుపడి స్కూలు చదువు అయిపోగానే వేరే దేశానికి తీసుకెళ్ళి పెళ్లి చేయాలి అని అనుకున్న తండ్రి పాత్రలో నటించారు.ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ వేరే ఉన్నా చివరికి మెంటాలిటీ ఒకటే. హీరోయిన్ కలలకు అడ్డుపడడం.
ముఖ్యంగా సీక్రెట్ సూపర్ స్టార్ అయితే తన కన్న కూతురి కలలు పట్టించుకోకుండా బెదిరించి తనకు నచ్చిన విధంగా చేయాలి అనుకునే తండ్రి పాత్ర అతనిది. కానీ నిజ జీవితంలో ఇందుకు భిన్నంగా తన కూతురు ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు రాజ్ అర్జున్. ఇంకొక విషయం ఏంటంటే ఆయన కూతురు కూడా నటనారంగంలో నే ఉంది. తను మన అందరికీ తెలుసు కూడా. తనే సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో విక్రమ్ కూతురు పాత్రను పోషించింది. తర్వాత దాగుడుమూత దండాకోర్ సినిమాలో కూడా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం హిందీలో కూడా ఎన్నో సినిమాలు చేస్తోంది సారా.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!