Pushpa 2 The Rule Teaser: నేడు రష్మిక మందన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక.. తెలుగు సినిమాలతో టాప్ హీరోయిన్ గా అవతరించింది. తెలుగులో 2017లో “చలో” సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం జరిగింది. అనంతరం విజయ్ దేవరకొండతో నటించిన “గీతగోవిందం”తో మంచి రొమాంటిక్ హిట్ అందుకుని యూత్ హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” సినిమా చేసి విజయం అందుకోవటం జరిగింది.
అనంతరం “పుష్ప” విజయంతో రష్మిక మందన లెవెల్ నేషనల్.. ప్రపంచ స్థాయిలోకి చేరిపోయింది. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” సెన్సేషన్ హిట్ అయిన సంగతి తెలిసిందే. “పుష్ప” తర్వాత ఇండియాలో సౌత్ మరియు నార్త్ లో వరుస అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో “పుష్ప 2” సినిమా యూనిట్ ఆమె ఫోటో ఒకటి రిలీజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. హ్యాపీ బర్త్ డే శ్రీవల్లి అంటూ.. చీర కట్టులో.. ఒంటినిండా నగలతో.. నడుముకి వడ్డానం ఉన్న ఫోటోని విడుదల చేశారు.
ఇదే సమయంలో మూడు రోజులలో ఏప్రిల్ 8వ తారీకు “పుష్ప 2 ది రూలర్” టీజర్ రిలీజ్ కాబోతున్నట్లు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ రాబోతున్నట్లు కూడా కన్ఫామ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 8వ తారీకు అల్లు అర్జున్ జన్మదినోత్సవం. దీంతో ఆ రోజు టీజర్ విడుదల చేస్తున్నట్లు “పుష్ప” నిర్మాతలు తెలియజేయడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. “పుష్ప” మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇండియా మొత్తం “పుష్ప 2” కోసం ఎదురుచూస్తోంది. దీంతో ఏప్రిల్ 8వ తారీకు విడుదల కాబోయే టీజర్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.