మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోని బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఫుల్ రన్ లో దాదాపు 60 కోట్ల వసూళ్లు రాబట్టిన వినయ విధేయ రామ సినిమా బయ్యర్లకి అక్షరాలా 34 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. తన కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా నిలిచిన వినయ విధేయ రామ గురించి మొదటిసారి స్పందించిన చరణ్, సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశామని, ప్రేక్షకులకి నచ్చే సినిమా అవుతుందనుకున్నాము కానీ అది నిరాశపరిచింది. అపజయంలో కూడా వెన్నంటి ఉన్న అభిమానులకి కృతజ్ఞతలు తెలుపుతూ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తానని చెప్పాడు. ఒక స్టార్ హీరో తన సినిమా గురించి ఇంత ఓపెన్ గా చెప్పడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి, వినయ విధేయ రామ రిజల్ట్ గురించి చరణ్ స్పందించిన విధానంపై అన్ని వర్గాల సినీ అభిమానుల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఓటమిని ఒప్పుకున్న రామ్ చరణ్ తేజ్ నిజంగా గ్రేట్ అంటూ మెగా అభిమానులు చెర్రీకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
next post