మీ టూ ఉద్యమం ముగిసిపోయిందా? అంటే లైంగిక వేధింపులు ఆగనంత కాలం ఈ ఉద్యమం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సీనియర్ మలయాళ నటుడు సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మలయాళ ఇండస్ట్రీల నటీమణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన డబ్ల్యు.సి.సి(ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)పై సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఆ వీడియో చూసిన రేవతి సిద్ధిఖీపై ఫైర్ అయ్యారు.
”2016 తిరువనంతపురం నీల థియేటర్లో ‘సుఖమయిరికటే’ సినిమా ప్రివ్యూలో సిద్ధిఖీ నాతో తప్పుగా ప్రవర్తించారు. ఆయన నాతో ప్రవర్తించిన తీరు, నేను దిగాలు పడ్డ రోజులు నాకింకా గుర్తున్నాయి. ఆయనకు నాలాంటి కూతురుంది. మరి ఇలాంటి పరిస్థితులు నీ కుమార్తెకు ఎదురైతే ఏం చేస్తారు? మిస్టర్ సిద్ధిఖీ. డబ్ల్యు.సి.సి కమిటీని విమర్శించడానికి నువ్వు అర్హుడివేనా? ఆలోచించుకో” అని తన ఫేస్బుక్లో మెసేజ్ పోస్ట్ చేశారు. అయితే ఈమె పబ్లిసిటీ కోసం సిద్ధిఖీపై ఆరోపణలు చేస్తున్నారని కొంత మంది నెటిజన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు.