Jawan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన “జవాన్” సినిమా నేడు విడుదల కావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఏకంగా “పఠాన్” సినిమా కంటే కూడా “జవాన్” సినిమా 100 రెట్లు బాగుందని సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. మొన్ననే “పఠాన్” సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగా ఏడు నెలల గ్యాప్ లో మరోసారి “జవాన్” తో షారుఖ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కూడా మాస్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించే రీతిలో చిత్రీకరించడం జరిగింది. ఫస్టాఫ్ ఓ రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ దానికి మించి అన్నట్టు డబల్ రేంజ్ లో డైరెక్టర్ అట్లీ చిత్రీకరించడం జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ లో షారుక్ ఖాన్… విజయ్ సేతుపతి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా తమ పాత్రలలో ఒదిగిపోయారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, ప్రజలు ప్రశ్నించకపోవడం వంటి అంశాలతో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో అట్లీ “జవాన్” తెరకెక్కించారు. సినిమాకి యాక్షన్స్ సన్నివేశాలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఇంకా క్లైమాక్స్.. సన్నివేశాలు గూస్ బంప్స్.. తెప్పించే విధంగా ఉన్నాయి. అంతా బాగానే ఉన్నా గాని అతిపెద్ద మైనస్ ఏమిటంటే.. సినిమాలో ఎక్కడా కూడా కామెడీకి ఆస్కారం లేదు. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. పూర్తి మాస్ నేపథ్యంలో సాగే సినిమా కావటంతో క్లాస్ ఆడియన్స్ కి కొద్దిగా తలనొప్పి తెచ్చినట్లు ఉంటది. ఎందుకంటే ఎక్కువగా షారుక్ అభిమానులు చాలా వరకు క్లాస్ కంటెంట్ ఇష్టపడతారు. కానీ ఈ సినిమాలో సినిమా స్టార్ట్ అయిన నుండి ఎండింగ్ వరకు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో కామెడీకి ఎక్కడ చోటు లేకుండా.. నడిపించడం జరిగింది. ఇదొక్క మైనస్ తప్ప మిగతా సినిమా అంతా అదరగొట్టింది.
కానీ షారుఖ్ అభిమానులు ఏ లుక్స్ లో తమ అభిమాన హీరోని చూడాలనుకుంటున్నారో ఆ రీతిగానే అట్లీ చూపించాడు. ఇక హీరోయిన్ గా నయనతార కేవలం గ్లామర్ పాత్రకే కాకుండా స్టోరీలో భాగం చేసి.. సినిమాకి హైలైట్ గా ఆమె పాత్రను తీర్చిదిద్దడం జరిగింది. గెస్ట్ రోల్ లో చేసిన దీపికా పదుకొనే ఇంకా హీరోయిన్ ప్రియమణి పాత్రలు సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అన్నిటికీ మించి సినిమా మొత్తానికి షారుక్ పాత్రకి దీటుగా విజయసేతుపతి విలనిజం ఇంకా బ్యాగ్రౌండ్ అనిరుద్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకోవడం జరిగాయి. షారుక్ కెరియర్ లో “జవాన్” అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.