టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన కామెడి ఫ్యామిలి ఎంటర్టైనర్ ఎఫ్2. హ్యట్రీక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా సంక్రాంతి అల్లుళ్లుగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్‌లోనూ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫేస్టివల్ సీజన్లో నాలుగు భారీ చిత్రాలు రిలీజ్ అయితే ఎఫ్ ఈ మాత్రమే అందరికి కనెక్ట్ అయింది. ఫ్యామిలి ఆడియన్స్‌తో పాటు యూత్ కూడా నచ్చేలా ఉన్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగిన సినిమాలన్నింటిలో పెద్ది హిట్‌గా నిలిచింది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మంచి హిట్‌గా నిలిచిన ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఈ సినిమా కథని వెంకటేష్, నితిన్ దృష్టిలో పెట్టుకొని సినిమా కథని రెడీ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి… అందుకే వరుణ్ తేజ్ పాత్రకు తెలంగాణ యాసని పెట్టారు. అయితే దిల్‌రాజు బ్యానర్లో నితిన్ శ్రీనివాస కల్యాణం చేస్తున్నాడు. మళ్ళీ దిల్‌రాజు ప్రొడక్షన్లో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. వరసగా ఒకే బ్యానర్లో సినిమా చేస్తే బాగుండదని భావించి ఎఫ్ 2 ని రిజక్ట్ చేశాడని తెలుస్తోంది. నితిన్ ప్లేస్‌లో వరుణ్ తేజ్ వచ్చాడు.
భారీ హోప్స్ పెట్టుకొని చేసిన శ్రీనివాస కల్యాణం ఫ్లాప్ కావడం,ఆ తరువాత హరీష్ శంకర్‌తో చేయలనుకున్న ప్రాజెక్ట్ కూడా కొన్ని కారణల వల్ల ఆగిపోయింది.. హిట్ కోసం చాలా రోజులగా ప్రయత్నాలు చేస్తున్న నితిన్ ఎఫ్ 2 సినిమా చేసి ఉంటే కెరీర్‌కు మంచి కాస్త బూస్టప్ అయ్యేది. ఆ రెండు సినిమాల వల్ల నితిన్ మిస్ చేసుకున్న ఎఫ్2 మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. మంచి సక్సెస్‌ని మిస్ నితిన్ ఇప్పుడు తెగ బాధ పడుతున్నాడట…చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటున్నారు కొంతమంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!