కరోనా తెచ్చిన కొత్త అవకాశాలు..! యువతా ఓ లుక్కేయండి..!!

 

ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేవలం వైద్య అత్యవసర పరిస్థితిని సృష్టించడమే కాక దేశవ్యాప్తంగా ఉపాధి సంక్షోభాన్ని కూడా సృష్టించింది. కోవిడ్ -19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్’, కరోనావైరస్ మహమ్మారిని “రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చెత్త ప్రపంచ సంక్షోభం” గా అభివర్ణించింది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశంలో 41 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోగా, నిర్మాణ, వ్యవసాయ రంగ కార్మికులు ఎక్కువ మంది ఉద్యోగ నష్టాలకు కారణమైంది.

 

తక్షణ సంక్షోభంలో యువత (15-24 సంవత్సరాలు) పెద్దలు (25 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) మరియు ఎక్కువ దీర్ఘకాలిక ఆర్థిక మరియు సామాజిక ఖర్చులను ఎదుర్కొంటన్నారు.
COVID-19 సంక్షోభానికి ముందే, ఆసియా మరియు పసిఫిక్ యువత కార్మిక మార్కెట్లో సవాళ్లను ఎదుర్కొన్నారు, ఫలితంగా అధిక నిరుద్యోగిత రేట్లు మరియు యువత యొక్క పెద్ద వాటాలు పాఠశాల మరియు పని రెండింటి నుండి మినహాయించబడ్డాయి. ఏ ప్రాంతంలోనైనా ఐదుగురు యువ కార్మికుల్లో నలుగురు అనధికారిక పనిలో నిమగ్నమయ్యారు ..

 

 

కరోనా వైరస్ సంక్షోభంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో మెడిసిన్ తెప్పించుకోవడానికి కూడా అనేక మంది ఆసక్తి చూపించారు. దీంతో మెడిసిన్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం, మెడిసిన్ హోమ్ డెలివరీ లాంటి సర్వీసులు బాగా పెరిగాయి. దీంతో ఫార్మసీల్లో, ఇ-ఫార్మసీల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి. ఫార్మాసిస్టులతో పాటు డెలివరీ బాయ్స్‌కి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఇక్కడితో ఆగిపోలేదు. ముందుముందు కూడా వీరికి ఫుల్ డిమాండ్ ఉండబోతోంది. ఫార్మసీ సంబంధిత కోర్సులు చేసినవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది వరకు వీరికి బాగా డిమాండ్ ఉండబోతోంది. వచ్చే ఏడాదిలోగా సుమారు లక్ష ఉద్యోగాల వరకు డిమాండ్ ఉండబోతోందని అంచనా. అంటే కొత్తగా ఒక లక్ష ఉద్యోగాలు ఈ రంగంలో రాబోతున్నాయి. కాబట్టి ఈ కోర్సులు చేసినవారికి మంచి రోజులు రానున్నాయి.

ఈ రంగం మాత్రమే కాదు ఇ-కామర్స్ రంగంలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా షాపింగ్‌కు వెళ్లేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఏం కావాలన్నా మొదట ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దామన్న ఆలోచన పెరిగిపోతోంది. దీంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి. ఇ-కామర్స్ రంగంలో సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, పార్సిల్ డెలివరీ లాంటి విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఈ అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి. అనుభవం లేకపోయినా ఫ్రెషర్స్‌ని నియమించుకొని స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి కంపెనీలు. అందుకే నిరుద్యోగులు ఏఏ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉందో తెలుసుకొని సంబంధిత కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంచుకోవచ్చు.