NTR: చాలావరకు ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR).. కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో సినిమాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అన్న కళ్యాణ్ రామ్(Kalyan Ram) సొంత నిర్మాణ ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) లో నటిస్తూ.. నిర్మాతగా రాణిస్తున్న అన్నకి… అండగా ఉంటూ వస్తున్నాడు. మరోపక్క కళ్యాణ్ రామ్ (Kalyan Ram)కూడా తన నిర్మాణ సారథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో సొంత ప్రొడక్షన్ లో.. తానే హీరోగా కూడా నటిస్తున్నాడు. ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసర” (Bhimbisara) అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి(Bahubali) తరహాలో ఈ సినిమా పోస్టర్లు మరియు వీడియోలు ఉన్నాయి. యుద్ధాలు పౌరాణిక చిత్రం మాదిరిగా…సీన్స్ ఉన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా రాణిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా… ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ చాలావరకు ముగియడంతో త్వరలో ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటువంటి తరుణంలో అన్న కళ్యాణ్ రామ్ కీలకంగా క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అంతేకాకుండా సినిమాలో స్టార్టింగ్ లోనే ఈ సినిమాకి సంబంధించిన చరిత్ర ఎన్టీఆర్ వాయిస్ సినిమా ప్రారంభంలో ఉంటుందట.
ఆ విధంగా “బింబిశార” సినిమా స్టార్ట్ ప్రారంభించడమే కాక సినిమాకి సంబంధించిన టీజర్.. కూడా త్వరలో ఎన్టీఆర్ రిలీజ్ చేయనున్నారట. టీజర్ కూడా ఎన్టీఆర్(NTR) వాయిస్ తో.. రిలీజ్ కానున్నటు ఇండస్ట్రీ టాక్. ఇటీవల ఇదే తరహాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej)… వరుణ్ తేజ్(Varun tej) గనీ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇదే తరహాలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్.. సినిమా “బింబీసారా” సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు అట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన సినిమా పాట వీడియో బాహుబలి సినిమాని గుర్తు చేయడం జరిగింది. దీంతో రాబోతున్న టీజర్ ఈ తరహా లో ఉంటుందో అన్నదానిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.