Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి లో పవన్ క్రేజ్ చాలా డిఫరెంట్. హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ఉంటుంది. ఇక అదే రీతిలో ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు.. డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న వాళ్లు చాలామంది.
అయితే అందరిలో కంటే.. నిర్మాత, కమెడియన్ బండ్లగణేష్ కి మాత్రం చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ తనకి భగవంతుడు.. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద భక్తుడను.. అంటూ బండ్ల గణేష్ చాలా బహిరంగ వేదికలలో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అటువంటి బండ్ల గణేష్ .. ఇండస్ట్రీ ప్రారంభంలో కమెడియన్ ఆ తర్వాత నిర్మాతగా రాణించక ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి కమెడియన్ పాత్రలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
Read more: Pawan kalyan: కోటి రూపాయల చెక్కు అందించిన పవన్ కళ్యాణ్..!!
ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా.. హీరోగా బండ్ల గణేష్ చేయటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వస్తోంది. విషయంలోకి వెళితే కొత్త డైరెక్టర్ వెంకట్ దర్శకత్వంలో బండ్ల గణేష్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. స్టోరీ అంతా ఓకే అన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.