NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pegasus: 300 మందిపై పెగాసెస్ నిఘా..? 161 మంది లిస్ట్ బయటకు..! అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం..!!

Pegasus: దేశంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వాన్ని, మరో పక్క బీజేపీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న అంశం పెగాసెస్ స్పైవేర్. దాదాపు మూడు వారాలుగా ఇది జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపుతుండటంతో రాజకీయంగా సంచలన అంశంగా మారింది. ఈ అంశంపై ఓ పక్క పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, బయట విపక్షాలు ఆందోళన చేస్తూ మరో పక్క సుప్రీం కోర్టులోనూ పిటిషన్ లు దాఖలు చేయడంతో అధికార బీజేపీ తీవ్రంగా ఇరుకున పడుతోంది. అయితే ఈ అంశంలో రెండు కోణాలు ఆలోచనలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎప్పుడైతే రాహుల్ గాంధీతో జత కలిశారో అప్పుడే పెగసెస్ స్పైవేర్ ద్వారా దేశంలో ప్రముఖుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు, నిఘా పెట్టారు అనే విషయం తెరపైకి వచ్చింది. సో.. ఇది కాంగ్రెస్ పార్టీ పుట్టించిన అంశం, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాత్మక అడుగు అని తేలిగ్గా తీసుకోవచ్చు. అయితే అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియాలో కొన్ని అధారాలతో ఈ అంశాన్ని నిరూపిస్తున్నాయి. కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది రెండు విధాలుగా కనబడుతోంది. ఈ అంశం నిజం అని నమ్మడానికి అధారాలు కనిపిస్తున్నాయి, మరో పక్క ఇది రాజకీయ అంశమే, దీనిలో ఎంత మాత్రం నిజం లేదు అని కొట్టిపారేయడానికి కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. సో..దీనిలో రెండు రకాలుగా కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.

దవైర్ వెబ్ సైట్ లో స్పైవేర్ బాధితుల పేర్లు

ఈ విషయాలు ఇలా ఉంటే అంతర్జాతీయ మీడియా సంస్థ ది వైర్ అనే వెబ్ సైట్ సంచలన విషయాన్ని బయటపెట్టింది మన దేశంలో ఎంత మంది ప్రముఖులపై పెగసిస్ స్పైవేర్ నిఘా పెట్టింది అనే విషయాలను వెల్లడించడం తీవ్ర సంచలనం అయ్యింది. దానిలో ఏవరు ఉన్నారో చూసుకుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నాయకులతో పాటు న్యాయవ్యవస్థలో (సుప్రీం కోర్టులో) పని చేసి రిటైర్ అయిన పలువురు రిజిస్ట్రార్ లు, అలాగే న్యాయవ్యవస్థలో కొంత మంది పెద్దలు, జర్నలిస్ట్ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు దాదాపు 300 మందికిపైగా ఉన్నారని సదరు వెబ్ సైట్ పేర్కొంది. పెగాసెస్ స్పైవేర్ నిఘా పెడితే వారి ఫోన్ కాల్స్, వారి వాట్సాప్ ఛాటింగ్, టెలిగ్రామ్ మేసేజ్ లు ఇలా అన్నీ కూడా పెగాసిస్ కు దొరికిపోతాయి అన్నమాట. దాదాపు 300 మందికిపై నిఘా పెట్టినట్లు వార్తలు వస్తుండగా అందులో 161 పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ 161 మంది పేర్లు ది వైర్ వెబ్ సైట్ ప్రచురించింది. ఇది ఓ కీలక అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో రాజకీయంగా బంది కాబోతున్నదా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ పరిణతి కావచ్చు, ఆయన రాజకీయ వ్యూహాలు కావచ్చు ఆయన ఏదైనా అంశాన్ని పట్టుకుంటే దాన్ని ఎంతగా రాజకీయంగా వాడుకోగలరో, తన అనుకూల పార్టీకి ఎంతగా ఉపయోగపడేలా చేయగలరు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రశాంత్ కిశోర్ దేశ వ్యాప్తంగా వైరల్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత రాజకీయ లబ్ది చేకూరేలా చేయాలి అనేది ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మక ఎత్తుగడగా కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అంశం ఇప్పుడిప్పుడే తేలే అంశం అయితే కాదు.

కేంద్రంలోని బీజేపీకి ఇబ్బందికరమే..?

ఎందుకంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు అంశం దొరికింది. రపేల్ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్రంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాహుల్ గాంధీ నాడు ఆరోపించారు. కానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించలేకపోయారు. రఫేల్ యుద్ధ విమానాల అంశంలో అవినీతిని బయటపెట్టలేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. కానీ పెగాసెస్ అలాంటిది కాదు. ఇది ఆర్థిక కుంభకోణం కాదు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. ప్రముఖులు, పెద్దల భద్రతకు సంబంధించిన అంశం. వ్యక్తిగత స్వేచ్చకు, రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారి తీసే అంశం ఇది. ఇదే నిజమని తేలితే రాజ్యాంగ సంక్షోభం కూడా తప్పదు. బీజేపీలో కూడా అంతర్గత తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీని దేశం మొత్తం ఆహ్వానించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా వచ్చే వ్యతిరేకతకు తోడు ఇటువంటి ఆరోపణలు, వివాదాల కారణంగా బీజేపీ మరింత దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తకు ఈ అంశం దొరికిన నేపథ్యంలో ఆయన ఊరికే వదలడు. రానున్న ఆరు నెలలు, సంవత్సర కాలంలో మరింత పెద్ద సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పాటు న్యాయపరమైన వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju