NewsOrbit
హెల్త్

Pregnant: ప్రెగ్నెంట్ గా ఉండగా మీ బిడ్డ క్షేమం కోసం ఇలా చేయండి!!

Pregnancy Facts Abouts Baby

Pregnant:  స్త్రీ అమ్మ  అవడం  అంటే అది ఒక వెలకట్టలేని వరం అనే చెప్పాలి. కడుపుతో ఉన్నవారు ఎప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ బిడ్డ పుట్టిన తర్వాత సంతోషంగా ఉండాలంటే  పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టండి…
నెగిటివ్ ఆలోచనలు, భయం,బాధ, లాంటివన్నీ బిడ్డపై కచ్చితం గా ప్రభావం చూపుతాయి. కాబట్టి  పాజిటివ్ గా ఆలోచిస్తూ బిడ్డ కోసం మంచి పాటలు,మాటలు  వింటూ.. మీ  కడుపులో ఉన్న బిడ్డకు ఆనందం గా   ఉండే  పనులు చేస్తూ ఉండాలి.

బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వారికి అన్ని విషయాలపై శిక్షణ ఇవ్వడాన్ని గర్భ సంస్కారం అంటారు. ఇది బిడ్డ  శారీరక,మానసిక  వికాసం కోసం చాలా అవసరం అని గుర్తు పెట్టుకోవాలి. దీనికోసం ఐదో నెల వచ్చిన దగ్గరనుంచి పిల్లలకు శిక్షణ  ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇందులో భాగంగా తల్లి మంచి సంగీతాన్ని   వింటూ ఉండడం.. కడుపు దగ్గర  పెట్టి శిశువుకు  వాటిని వినిపించడం వల్ల పిల్లల ఆలోచన విధానం పై అది కచ్చితంగా ప్రభావం చూపుతుంది.ఇది ఆశ్చర్యం కలిగించిన కూడా అనేక పరిశోధనలు రుజువు  చేశాయి. కాబట్టి మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే మీ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే కాదు పుట్టిన తర్వాత కూడా  ఎదిగే క్రమం లో కూడా వారు చాలా ఆనందం గా  ఉంటారు. మంచి ఆహారం కూడా బిడ్డను ప్రభావితం చేస్తుంది.

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు  పండ్లు తినడం అనేది మంచి పద్దతే … అయితే పచ్చి బొప్పాయి, పైనాపిల్, ద్రాక్ష మాత్రం తీసుకోకుండా ఉండటం మంచిది.గర్భం తో ఉన్నవారు   పచ్చి బొప్పాయి తినకూడదు అని మన పెద్దలు కూడా చెబుతుంటారు.   ఇది శరీరం యొక్క  ఉష్ణోగ్రతను పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది.  ఇందులో ఉండే  లేటెక్స్ రక్తస్రావం అయ్యేలా చేస్తుంది కూడా. అందుకే దీన్ని తినకూడదు. అలాగే పైనాపిల్ లో బ్రొమిలిన్ అనే కెమికల్ ఉండటం వల్ల అది గర్భాశయం గోడల ను ముడుచుకుపోయే విధంగా  చేసి  గర్భస్రావం జరిగేలా చేస్తుంది.  నల్ల ద్రాక్షలో ఉండే  రెస్వెరటాల్ అనే కెమికల్ కూడా కడుపులో ఉన్న శిశువుకు విషంగా  అందుతుంది.  కాబట్టి దీన్ని కూడా  తినకుండా ఉండడం మంచిది.

పాశ్చరైజ్ చేయని జ్యూస్ లేదా పాలలో  ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే  అవకాశం  ఉంటుంది. ఇది పుట్టబోయే  బిడ్డ ప్రాణాలకు హాని చేస్తాయి. అందుకే వీటికి   దూరంగా ఉండటం   మంచిది.క్యాలరీలు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్  లో   శరీరానికి అవసరమయ్యే పోషకాలు తక్కువగా ఉంటాయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు  తల్లి  శరీరం తో పాటు    శిశువు  శరీరం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ఎదిగే సమయంలో ఎన్నో పోషకాలు అవసరమవుతాయి.కాబట్టి మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలు మాత్రమే కాకుండా పోషకాలు కూడా ఉండేలా జాగ్రత్త పడాలి.  కాబట్టి  ప్యాకేజ్డ్ ఫుడ్ కి దూరంగా  ఉండటం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri