ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ ‘గంగా విలాస్’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుండి 3,200 కిలో మీటర్లు ప్రయాణించనున్నది. అస్సొంలోని దిబ్రూగర్ వద్ద మొదటి పర్యటన ముగియనున్నది. ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారణాసి లో టెంట్ సిటీకి పీఎం శ్రీకారం చుట్టారు. గంగ ఘాట్ వద్ద 200 టెంట్ల ఏర్పాటుతో పాటు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ను ప్రారంభించారు మోడీ.

వారణాసి నుండి బయలుదేరే ఈ గంగా విలాస్ క్రూయిజ్ మొత్తం 3,200 కిలో మీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసొంలో దిబ్రుగఢ్ కు చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజుల సమయం పడుతుంది. 27 నదులను దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్ లో 18 సూట్స్ ఉన్నాయి. 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది. ప్రయాణీకుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. నిత్యం క్రూయిజ్ లో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీస్, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఆనందించే అవకాశం ఉంటుంది.

ఈ క్రూయిజ్ పర్యటనలో ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్వానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కల్గిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. గంగా విలాస్ బీహర్ లో పట్నా, జార్ఖండ్ లో సాహిబ్ గంజ్, పశ్చిమ బెంగాల్ లో కోల్ కతా, బంగ్లాదేశ్ లో ఢాకా, అసొంలోని గౌహరి పట్టణాలను కవర్ చేస్తుంది. అంతర లగ్జరీ రివర్ క్రూయిజెస్ అనే కంపెనీ గంగా విలాస్ క్రూయిజ్ నౌకను నడుపుతోంది. మెయిన్ డెక్ లో 40 సీట్ల సామర్థ్యం గల రెస్టారెంట్ ఉంది. అప్పర్ డెన్ లో బార్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 40 మంది సిబ్బంది ఉంటారు.

టికెట్ ధర ఎంత అంటే…?
ఒక వ్యక్తికి రోజుకు రూ.42,500లు చార్జ్ చేస్తారు. దీనికి జీఎస్టీ అదనం, నదిలో ప్రయాణం, చుట్టుపక్కల ప్రాంతాల సందర్శన, నౌకలో కల్పించే సదుపాయాలు అన్ని ఈ ప్యాకేజీలో ఉంటాయి. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే రూ.85లు (జీఎస్టీ అదనం) చార్జ్ చేస్తారు. మొత్తంగా 51 రోజుల ప్యాకేజీకి సుమారు రూ.40లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.
టికెట్లు ఇలా బుక్ చేసుకోవాలి
గంగా విలాస్ షిప్ ను నిర్వహించే అంతర లగ్జరీ రివర్ క్రూయిజెస్ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే బుకింగ్స్ అన్ని అయిపోయాయని, మరో రెండేళ్ల వరకు ఖాళీలు లేవని అంతర లగ్జరీ రివర్ క్రూయిజెస్ సేల్స్ డైరెక్టర్ (ఇండియా) కాసిఫ్ సిద్ధిఖీ న్యూస్ సైట్ మనీ కంట్రోల్ కు తెలిపారు. విశేషం ఏమిటంటే.. తెలుగు డిజైనర్ అన్నపూర్ణ ఈ నౌకను భారత్ లో తయారు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని నెదునూరు గ్రామానికి చెందిన డిజైనర్ అన్నపూర్ణ గరిమెళ్ల చరిత్ర పరిశోధకురాలు. కొలంబియా యూనివర్సిటీ నుండి ఆర్ట్ హిస్టరీ లో పీహెచ్ డీ చేసిన అన్నపూర్ణ అనేక యూనివర్సిటీలకు పని చేశారు.
Breaking: ట్రక్ ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. పది మంది మృతి