తెలంగాణలో ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా వాయిదా వేసినట్లు పేర్కొంది.

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానిస్తున్నారు అధికారులు. హ్యాకింగ్ పై పోలీసులకు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
Delhi Liquor Scam: తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కవిత ఈడీ విచారణ ఇలా.. మరో సారి విచారణ ఎప్పుడంటే..?