NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

AP Ploitical Breaking: పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీ తో అంటున్న చింతమనేని ప్రభాకర్..??

AP Ploitical Breaking: 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ చేసిన వారిలో అప్పటి అధికార పార్టీ టీడీపీ నాయకుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. చాలా సందర్భాలలో చింతమనేని ని టార్గెట్ చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఒక ఆకు రౌడీ, వీధి రౌడీ.. చింతమనేని అంటూ పవన్ అప్పట్లో భారీ డైలాగులు వేశారు. ఇదే తరుణంలో చింతమనేని ప్రభాకర్ కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ లు వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ .. చింతమనేని ప్రభాకర్ ఇద్దరు కూడా ఓడిపోవడం తెలిసిందే.

Pawan Kalyan met AP CM Chandrababu Naidu | Jana Sena

ఈ పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్.. మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో ఓడిపోయిన చింతమనేని ప్రభాకర్ కూడా ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూనే మరోపక్క అనేక పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో చింతమనేని ప్రభాకర్ తాజాగా ఓ ప్రైవేటు సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ టీడీపీ లోకి…??

విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి చింతమనేని సమాధానం చెబుతూ ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, వాళ్ళ తాత మాదిరిగా ప్రజా సేవ చేయాలని అనుకుంటే కచ్చితంగా వస్తారు అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో యాంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అని చింతమనేని నీ ప్రశ్నించారు. దానికి చింతమనేని సమాధానం చెబుతూ కచ్చితంగా … జగన్ పాలన లోపల విషయంలో ఆయన ఏవిధంగా పోరాడుతున్నారో మేము అదే రీతిలో… ప్రభుత్వంపై పోరాడుతున్నామని… కలిసి పని చేస్తే చేయొచ్చు.. అంటూ చింతమనేని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి ఉంటే మళ్లీ ఎమ్మెల్యే అయ్యేవాడిని… లేకపోతే ఆయన అయ్యేవాళ్ళు.. అంటూ చింతమనేని ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

గోదావరి జిల్లాలో ఓట్లు చీలకుండా పవన్  టిడిపి తో..

పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క కచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబు ఇతర పార్టీలను కలుపుకుని వైయస్ జగన్ మీద పోటీకి వెళతారని వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిస్తేనే చంద్రబాబు కి చాలా బెనిఫిట్ ఉంటుందని.. గోదావరి జిల్లాలో ఓట్లు చీలకుండా ఉంటాయని..విశేషకులు అంటున్నారు. అంతమాత్రమే కాకుండా పరిషత్ ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ అదే రీతిలో జనసేన పార్టీ క్యాడర్ కొన్ని చోట్ల కలిసి పని చేసినట్లు.. పరిషత్ ఎన్నికల టైంలో వార్తలు వచ్చాయి. దీంతో కచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు చంద్రబాబుతో పవన్ కలవడం గ్యారెంటీ అని బలంగా వార్తలు వస్తున్న తరుణంలో చింతమనేని చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోపక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో పెద్దగా అంటీ అంటనట్టు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబుతో ఆయన చేతులు కలపడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతోంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju