ఆఫీస్ లో ఏసీ బాగా వాడే మగవారు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి!!

Share

ఆఫీసులో  ఏసీ ఉష్ణోగ్రత ఎక్కువ,  తక్కువ  ఉండడం వల్ల ఆడవారికి  , మగవారికి ఎలాంటి హాని కలుగుతుంది తెలుసుకుందాం . ఈ రోజుల్లో ఆడవారు కూడా  మగవారి తో  సమానంగా కష్టపడుతున్నారు. ఎన్నో  సమస్యలు ,ఇబ్బందులు వేధింపులు  ఎదురుకుంటున్నారు. అయితే ఇవన్నీ  ఒకెత్తయితే  ఆడవారిని  వేధిస్తున్న  మరొక సమస్య వాతావరణం.


బయట వాతావరణం తో సంబంధం లేకుండా  ఆఫీస్ లో కి  రాగానే మగవారు  ఏసీ తక్కువ టెంపరేచర్ లో  పెట్టి ప్రశాంతంగా  కూర్చుని పని చేసుకుంటూ ఉంటారు. దీంతో స్త్రీలు ఎక్కువ  ఇబ్బంది పడుతుంటారు. సహజం గా  మగవారు  చల్లటి వాతావరణాన్ని  బాగా ఇష్టపడుతారు. స్త్రీలు మాత్రం అలా కాదు. బయట వాతావరణం కాస్త చల్లగా ఉంటే  చాలు  వణికి పోతుంటారు. అందుకే వాతావరణం కాస్త వేడిగా ఉంటే సౌకర్యంగా ఉండగలుగుతారు .
ఇది  కేవలం నోటి  మాట మాత్రమే కాదు తాజాగా చేసిన అధ్యయనంలో కూడా ఈ విషయాన్ని బయటపెట్టారు నిపుణులు.

ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పనిచేస్తున్న స్త్రీల  పనితీరు మెరుగ్గా ఉందని , చల్లగా ఉన్న ప్రదేశంలో మగవారి  పనితీరు బాగుంది అని  తేలింది. ఈ పరిశోధన  కోసం 500 మంది స్త్రీ, పురుషులను  24 గ్రూపులుగా  చేసి  వేరు వేరు  గదుల్లో ఉండేలా చేసారు . ఇందులో 61-91 ఫారెన్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ను  మారుస్తూ అక్కడ పనిచేసే వారి పనితీరును అంచనా వేశారు.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు స్త్రీలు చురుగ్గా పనులు చేసుకుంటుండగా ఉష్ణోగ్రత చల్లగా మారినప్పుడు మగవారి  పని సామర్థ్యం పెరిగినట్లు గా గమనించారు.మహిళలు   సాధారణంగా 77 ఫారెన్ డిగ్రీల వాతావరణంలో సౌకర్యంగా ఉంటే ,మగవారు  72 ఫారెన్ డిగ్రీల ఉష్ణోగ్రతను కోరుకుంటున్నారు. ఈ మార్పుకు కేవలం ఆడవారు  ధరించే బట్టలు కారణంగా   తెలుస్తోంది. పలుచగా ఉన్న బట్టలు వేసుకోవడం  వల్ల శరీరానికి చల్లదనం తగులుతుంటుంది. మగవాళ్ళు వేసుకునే జీన్స్ కారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ వారికి వేడిగా వుండి ఎక్కువ చల్లదనాన్ని  కోరుకుంటూ ఉంటారు.


Share

Related posts

చంద్రబాబు, వైఎస్సార్ సినిమాలో జగన్..!!

sekhar

పాదాలకి ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి !

Kumar

లీకులతో వకీల్ సాబ్ కి భారీ నష్టం ..?

GRK