Rajamouli: ఇపుడు ఇండియాలోని సినిమా పరిశ్రమలన్నీ ఒకే ఒక పరిశ్రమపై తమ దృష్టిని సారించాయి. అదే మన తెలుగు చిత్ర సీమ. అవును… ఇక్కడి నుండి నెక్స్ట్ ఏ సినిమా రాబోతోందా? అని చాలా మంది సినీ ప్రముఖులు వెయిట్ చేస్తూ వుంటారు. దానికి కారణం ఒకే ఒక సినిమా.. ఒకే ఒక దర్శకుడు. అతడే దర్శక ధీరుడు రాజమౌళి.. ఆ సినిమానే బాహుబలి అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. బాహుబలి – 2 సినిమా రిలీజై 3 సంవత్సరాలు దాటినా.. అది క్రియేట్ చేసిన ఆరా అంతా ఇంతా కాదు. జక్కన్న ఎక్కడికి వెళ్లినా దాని గురించే ప్రశ్నలు అడుగుతారు.
టీడీపీ నేత కళా వెంకట్రావుకు హైకోర్టులో ఊరట
బాహుబలి – 3 సంగతి:
రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాహుబలి 3 సినిమా గురించి జక్కన్న ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బాహుబలి సినిమా మూడవ భాగం కూడా ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకంను రాజమౌళి తాజాగా వ్యక్తం చేశాడు. బాహుబలి మూడవ పార్ట్ కు స్కోప్ ఉందని, ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా దాన్ని తీసే అవకాశం లేక పోలేదు అని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు.
Rajamouli: రాజమౌళి కోసం అతిపెద్ద త్యాగం చేసిన టాప్ మోస్ట్ హిందీ సినిమా..!
ఎప్పుడు రావచ్చు?
త్వరలో భారీ అంచనాలు మధ్య RRR సినిమా రిలీజ్ కానుంది. తర్వాత సినిమా మహేష్ బాబుతో అనే విషయం మనకు తెల్సిందే. ఆ సినిమా తర్వాత బాహుబలి 3 ఉంటుందేమో అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి అవకాశం లేకపోలేదని కొందరు సినీ పండితులు పంచాంగం చెబుతున్నారు. ఏది ఏమైనా జక్కన్న అభిమానులకు ఇది తీపి వార్తే మరి! మరింత సమాచారం కొరకు మనం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.