NewsOrbit
న్యూస్

RBI: నిన్న ఎస్బీఐ! నేడు యూబీఐ!కోటి రూపాయల జరిమానాలతో కొరడా ఝళిపిస్తున్న ఆర్బీఐ!!

RBI: తన ఆదేశాలు ధిక్కరిస్తున్న జాతీయ బ్యాంకులభరతం రిజర్వుబ్యాంకు పడుతోంది.నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండ్రోజుల క్రితం బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోటి రూపాయలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.

RBI whipping crores of rupees in fines !!
RBI whipping crores of rupees in fines

ఇది ఇంకా మరుగున పడకముందే మరో జాతీయ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా రిజర్వ్ బ్యాంక్ సోమవారం కోటి రూపాయల జరిమానా విధించింది.రిజర్వ్ బ్యాంక్ అవలంబిస్తున్న కఠిన వైఖరి జాతీయ బ్యాంకులకు వణుకు పుట్టిస్తోంది.

యూనియన్ బ్యాంక్ చేసిన తప్పిదాలివే!

మొండి బాకీలుగా పరిగణించదగ్గ బ్యాంకింగ్ కార్యకలాపాల వివరాలను ఎప్పటికప్పుడు తమకు పంపాలని రిజర్వు బ్యాంక్ 2016 లోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది.అలాగే ఆయా బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు పొందిన వారి జాబితాను కూడా తయారు చేసి ఉంచాలని,అలా వారిపై నిఘా వేయడంతో పాటు క్రిమినల్ చర్యలకు కూడా బ్యాంకులు సిద్దంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలిచ్చింది.అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివేమీ పాటించలేదని,ఏ జాగ్రత్తలూ తీసుకోలేదని వార్షిక ఆడిట్లో తేలింది. బ్యాంకులను మోసగించే వాళ్లకు ఇది రెడ్ కార్పెట్ వేయడం వంటి చర్య అని రిజర్వు బ్యాంకు అభిప్రాయపడింది .దీన్ని తీవ్రంగా పరిగణించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదరు బ్యాంకుకు కోటి రూపాయల జరిమానాను విధించింది.ఈ వ్యవహారంలో ఇంకా లోతుగా జరిపి అవసరమైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యున్నత అధికారులపై చర్యలకు కూడా రిజర్వు బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

ఇక ఎస్బీఐ కేసేమిటంటే?

కేవలం రెండు రోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐ కి కూడా కోటి రూపాయలు జరిమానా విధించడం సంచలనం రేపింది.సాధారణంగా ఎస్బీఐ జోలికి ఎవ్వరూ వెళ్లరు.ఆ బ్యాంకుకు ఉన్న నేమ్& ఫేమ్ అలాంటిది.కాని రిజర్వుబ్యాంక్ ఆ బ్యాంకు ని కూడా వదిలిపెట్టలేదు.అనేక కోణాల నుంచి దర్యాప్తు జరిపి అతిపెద్ద కుంభకోణం బయటపెట్టింది.రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా రుణగ్రహీతల కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఉన్న విషయం వెలుగుచూసింది.తద్వారా ఎస్బీఐ కూడా రుణగ్రహీతలతో కుమ్మక్కయినట్లు అభిప్రాయపడింది.ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించిన రిజర్వ బ్యాంక్ ఎస్బీఐకి కోటి రూపాయల జరిమానా విధించింది.ఇలా వరుసగా ఆర్బీఐ జాతీయ బ్యాంకుల వెంట పడుతుండటంతో ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందోనని భీతిల్లుతున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju