ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజ కి మంచి డిమాండ్ ఉండేది. ఈ మాస్ రాజాతో సినిమా చేస్తే కచ్చితంగా లాభాలు రాకపోయినా గాని సేఫ్ జోన్ లో ఉండటం గ్యారెంటీ అని చాలామంది నిర్మాతలు రవితేజ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చేవారు. ఒక వేళ సినిమా హిట్ అయితే మాత్రం లాభాలు కూడా బాగానే వచ్చేవి. అయితే గత కొన్ని రోజుల నుండి రవితేజ మార్కెట్ చూస్తే చాలావరకు డౌన్ అయిపోయింది.
“రాజా ది గ్రేట్” సినిమా కి ముందు చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఆ తర్వాత సినిమాలు ఒప్పుకున్నా గాని… చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో.. రవితేజ కెరియర్ పూర్తిగా ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉంది. ఇటువంటి తరుణంలో రవితేజ కెరీర్లో మర్చిపోలేని హిట్లు “బలుపు”, “డాన్ శీను” వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని… తాజాగా గా “కిలాడి” అనే సినిమా చేయడం జరిగింది. “విక్రమార్కుడు” సినిమా తరహాలో ఈ సినిమాలో డబల్ రోల్ లో రవితేజ నటించినట్లు ఫిలింనగర్ టాక్. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నా.. అంతా బాగానే ఉన్నా గాని మార్కెట్ పరంగా ఈ సినిమా ధర తక్కువ పలుకుతున్నట్లు ఫిలింనగర్ ట్రేడ్ వర్గాల టాక్.
ఈ సినిమాకి కోనేరు సత్యనారాయణ అనే నిర్మాత భారీగా ఖర్చు పెట్టిన గాని కరోనా ఎఫెక్ట్ తో పాటు.. రవితేజ సినిమాల కి డిమాండ్ తగ్గటంతో… కిలాడి సినిమా ధర పెద్దగా పలకడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రవితేజ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి రవితేజ రావాలని కోరుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం కాబట్టి రవితేజ కొత్త సినిమా “కిలాడి” విజయం సాధిస్తుంది అనే భావనలో అభిమానులు ఉన్నారు.