NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

కొల్లగొట్టిన సొమ్ము 1.46 లక్షల కోట్లు : భారతంలో బాగోతాలు

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం )

స్వతంత్ర భారతంలో… అంతకుముందు బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము ఎంతో తెలుసా… అక్షరాలా 1.46 లక్షల కోట్లు. దీనిని అంకెల్లో రాయడం సాధ్యం కాదు కనుక… చదవడానికి పాఠకులకు ఇబ్బంది కనుక దీనిని అంకెల్లో రాయ డం లేదు మన్నించండి…. కానీ మీరు చదివింది నిజమే… ఇప్పటి వరకు భారతదేశంలో బ్యాంకులు ఎంత మొత్తం నష్టపోయాయి అనే విషయాన్ని ఓ సమాచార హక్కు కార్యకర్త బయటకు తీసుకువచ్చారు… తాజాగా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా భావిస్తున్న ట్రాన్స్ట్రాయ్ మోసం వెలుగు చూశాక ఆంధ్రప్రదేశ్ లో గుబులు రేపుతున్న సమయంలో అసలు మొత్తం భారతదేశంలోనే ఎంత మొత్తం పక్కదారి పట్టింది అనేది సమాచార హక్కు కార్యకర్త బయటకు తీసుకువచ్చారు… ఇది ఇప్పుడు జాతీయ మీడియా లోనే హాట్ టాపిక్…. అన్నం పెట్టే రైతు కు కనీసం లోన్లు రుణాలు ఇవ్వని బ్యాంకులు మోసగాళ్ల చేతిలో మోసపోతే భారీ ఎత్తున డిఫాల్టర్ల గా చేసుకొని, ఎంత డబ్బు నష్టపోతున్నాయి.. బ్యాంకులు నష్టపోతున్న ఆ భారం పడేది వినియోగదారుడికి అంటే ప్రజలకి…

పుణేకు చెందిన సమాచార హక్కు కార్యకర్త వివేక్ వాలంకర్ సమాచార హక్కు దరఖాస్తు ద్వారా అసలు ఇప్పటివరకు దేశంలో బ్యాంకులు ఎంత మేర సొమ్ములు డిఫాల్టర్ల చేత నష్టపోయాయి అనే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ను అడిగాడు.. దీనికి ఆర్థిక శాఖ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సమాచారం తెప్పించుకొని వివేక్ కు సమాచారం ఇచ్చింది.
** 1913 నుంచి జూన్ 2020 వరకు మొత్తం 1.46 లక్షల కోట్లు భారతదేశంలోని బ్యాంకులు నష్టపోయాయి. బ్యాంకుల దగ్గర వివిధ రకాలుగా మోసాలు చేసి రుణాలు పొందిన ఎంతోమంది డిఫాల్ట్ గా మారడం ద్వారా ఈ నష్టం వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అంటే వారి తాలూకా ఆస్తుల జప్తు గాని ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకోవడం గానీ బ్యాంకులు చేయలేదు. ఫలితంగా వారు పెట్టిన ఐపీ బ్యాంకులు భరించాల్సి ఉంది.
** 264 మంది డిఫాల్టర్లు వంద కోట్ల పైబడి తీసుకొని రుణాలు ఎగ్గొట్టిన వారు ఉన్నారు. మిగిలిన వారు చిన్నాచితకా అమౌంట్ తీసుకొని కోట్ల రూపాయలలో ఎగ్గొట్టిన వారే కనిపిస్తారు.
** 23 మంది డిఫాల్టర్ల వెయ్యి కోట్ల రూపాయల రుణాలు పైబడి తీసుకొని తిరిగి చెల్లించకుండా బ్యాంకులు ఐపి పెట్టారు. ఈ 23 మంది చెల్లించాల్సిన మొత్తం… 43,324 కోట్లు.
** 34 మంది డిఫాల్టర్ల 500 కోట్లు నుంచి వెయ్యి కోట్ల మధ్యలో రుణాలు తీసుకొని ఎగొట్టారు. వీరి నుంచి రావాల్సిన మొత్తం 22,105 కోట్లు.
** 207 మంది డిఫాల్టర్లు 100 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య రుణాలు తీసుకుని తర్వాత బ్యాంకులకు మొహం చాటేశారు. వీరి ద్వారా బ్యాంకులకు రావాల్సిన మొత్తం 43,095 కోట్లు.
** 264 మంది మహానుభావులు 100 కోట్ల రూపాయలు లేదా అంతకు మించి రుణాలు తీసుకొని బ్యాంకులను నిండా ముంచిన వారు ఉన్నారు. వీరు నుంచి బ్యాంకులు రాబట్టాల్సిన మొత్తం 1,08,527 కోట్లు…
** డిఫాల్టర్ల మీద బ్యాంకులు రకరకాలు కేసులు పెట్టినా అవి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయాయి. డిఫాల్ట్ అర్ లు కొన్ని రోజులు కేసులు ఎదుర్కొని తర్వాత ధీమాగా సమాజంలో పెద్ద మనుషులు గా చలామణి అవుతున్న వారే… స్వతంత్ర భారతదేశంలో అన్నం పెట్టే రైతుకు రూపాయి రుణం ఇవ్వడానికి బ్యాంకులు సవాలక్ష కారణాలు చెపుతాయి…. రుణాలు తీసుకొని మొహం చాటేసే డిఫాల్టర్ల కు మాత్రం డూడూ బసవన్నల తల ఆడించడం భారతదేశంలోనే చెల్లింది.

 

 

author avatar
Comrade CHE

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju