న్యూస్

బాపు మ్యూజియంను ప్రారంభించిన వైఎస్ జగన్

Share

పదేళ్ల కిందట మూతపడిన విజయవాడలోని బాపు మ్యూజియంను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు. దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో ఆ మ్యూజియాన్ని పునరుద్ధించారు. ఇందులో 80 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తే, 20 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది.

 

ys jagan inaugurates bapu museum in vijayawada
ys jagan inaugurates bapu museum in vijayawada

 

జగన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. బాపు మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు జగన్. అనంతరం బాపూజీ చిత్ర పటానికి నివాళులర్పించిన జగన్, జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. ఆ మ్యూజియాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతో ఈ మ్యూజియం విరాజిల్లుతుంది. 10 లక్షల ఏళ్లకు పైగా చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అరుదైన 1,500 వస్తువులను ఏ మ్యూజియంలో పొందుపరిచారు.

 


Share

Related posts

Bunny: కోలీవుడ్ ఇండస్ట్రీ టాప్ నిర్మాతతో బిగ్ ప్లాన్ వేసిన బన్నీ..??

sekhar

Daily Horoscope ఆగష్టు 13th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

Eatela Rajendar: కేసీఆర్ కు ఈట‌ల రాజేంద‌ర్ టైం ఇస్తున్నారా?

sridhar