వచ్చేవారం గాంధీ జయంతి
ఓహ్ సభలు ఉపన్యాసాలు ఒకటేవిటి చాల హడావిడి
గాంధీ మార్గాన్ని అనుసరించాలి అంటాం అంతే
ఏవిటి మనం చేస్తున్నాం
ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి
గాంధీ పుట్టిన దేశం అని గొప్పగా చెప్పుకుంటాం
గాడ్సే పుట్టిన దేశం కూడా ఇదే
పాలసముద్రం చిలికినప్పుడు రాక్షసులు పుట్టేరు దేవతలు పుట్టేరు
ఇప్పటి తరానికి గాంధీ అంటే ఇందిరాగాంధీ మాత్రమే తెలుసు
గాంధీని జాతిపిత అంటాం
జాతిమాత ఎవరూలేరు అందుకే భ్రష్టు పట్టిపోయేం
కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఏ ఇంట్లో చుసినా గాంధీ ఫొటోలే
ఏ జంక్షన్లో చూసినా గాంధీ విగ్రహాలే
ఇప్పుడు ఆ విగ్రహాలను ఎవరు పట్టించుకోరు
విగ్రహం నిండా దుమ్ము తలమీద పక్షుల రెట్టలు
ఒకప్పుడు చేతిలో కర్ర ఉండేది
పశువులు కాసే కుర్రాళ్ళు ఆ కర్ర పట్టుకుపోయేరు
జాతి మతం కులం అడా మొగ చిన్న పెద్ద అందర్నీ దేశం మొత్తాన్ని ఒక తాటిమీద నడిపించేడు
ఇప్పుడు తాడూ లేదు
నడిపించేవాడు లేడు
ఏవిటో గాంధీ నీ అంత అమాయకుడిని నేను చూడలేదు
మన దేశ చరిత్రలో ఇన్ని మానభంగాలు ఇన్ని హత్యలు ఎప్పుడైనా ఉన్నాయా
ఇదా గాంధీ నువ్వు ఆశించిన దేశం
నువ్వు బారిస్టరువి తెలివైనవాడివి అపాత్రదానం చెయ్యకూడదని తెలీదా
నువ్వు ఆశించిన శాంతి నువ్వు బోధించిన అహింస ఏవి
భారతదేశం రత్నగర్భ అన్నపూర్ణ అన్నారు
అవన్నీ గత వైభవాలు
ఇప్పుడు మాకు ఏవి మిగిలిందో తెలుసా
తిండిదరిద్రం భావదరిద్రం భాషాదరిద్రం
అన్నట్టు నీకు తెలుసా భారతదేశం ఒక పెద్ద అంగడి
చదువు సీట్లు ప్రమోషన్లు పిల్లలు ఆడవాళ్లు అన్నీ డబ్బు పారేస్తే దొరుకుతాయి
ఇప్పుడు నీలాటి వందమంది గాంధీలు వచ్చినా మమ్మల్ని బాగుచెయ్యలేరు
We are unrepairable
ఏవిటో గాంధీ ఆవేశం ఆగక ఏదో అనేసేను
నన్ను క్షమిస్తావు కదూ ఎందుకిలా దుమ్ములో నిల్చుంటావు
మా కెవ్వరికీ అందనంత దూరం వెళ్ళిపో
నిన్ను మరిచిపోలేములే
నీ జయంతినాడు ఓపూలదండ వేస్తాము
అదే నీకు మేవిచ్చే బహుమతి
క్షమిస్తావు కదూ
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ