ఊరంతా విష జ్వరాలతో మూలుగుతూ వణికిపోతోంది
హాస్పిటల్స్ అన్ని తిరణాల్లాగా కిటకిట లాడుతున్నాయి
పసిపిల్లల్ని భుజాన వేసుకొని జనం గంటలతరబడి క్యూలో నిల్చుంటున్నారు
వాళ్ళకి కనీసం బెంచీలు వెయ్యాలని హాస్పిటలు వాళ్ళకిగాని గవర్నమెంట్‌కు గాని తోచలేదు
బెంచీల సంగతి సరే సరిపోయినంత మంది డాక్టర్లూ లేరు
మందులు లేవు మంచాలు లేవు ఒక మంచం మీద ఇద్దర్ని వేస్తున్నారు
ఇంకా చాలకపోతే నేలమీద వేస్తున్నారు
అదేవి ఖర్మో మనకి అన్నీ కొరతే
దేనికి ఫండ్స్ లేవు
ఇంతకీ ఈ జ్వరాలకి కారణం ఎవరోతెలుసా
ఈ అక్షరమంత కూడా లేని దోమలు
చంద్రుడిమీద జెండా పాతుతాం అంగారక గ్రహంలో నీళ్లు ఉన్నాయో లేదో చూస్తాం అని మిల్లియన్లు ఖర్చు చేస్తున్నారు
ఈ చిన్న దోమని లేకుండా చేయలేకపోతున్నారు
Prevention is better than remedy
మనకి రెండు లేవు
దోమతెరలు వాడమని సలహాలిస్తున్నారు
కాళ్ళు చాపుకొని పడుకోడానికి చోటు లేదు దోమతెర ఎక్కడ కట్టుకుంటారు
నిన్ననే మా అమ్మాయిగారింటికి వెళ్లేను
మా మనవడు నీరు కారుతూ వచ్చేడు
పలకరిస్తే తన్నేలా ఉన్నాడు
చెరువులు యేవి అన్నావు ఒక్కసారి బాల్కనీలోకి వెళ్లి చూడు అన్నాడు
చూసేను చెరువులు కాదు సముద్రాలు
రోడ్డు లేదు అంతా నీరే ఎక్కడ గొయ్యి ఉందో తెలీదు
ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో తెలీదు
నీటి నిండా దోమలు ఈగలు పక్కనే టిఫిన్ బళ్ళు
జబ్బులు వచ్చాయంటే రావూ
రోడ్డు మీద నీరులాగా హాస్పిటల్స్ అన్ని పేషేంట్లతో నిండిపోయేయి
మలేరియా చికెనుగున్యా డెంగ్యూ ఒకటా రెండా
ఏమందుకీ యే జబ్బూ తగ్గదు
డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు
వైరల్ దానంతట అదే తగ్గాలిట దాని ఇష్టవేనట
దానికి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ
ఈ దోమలు పోవు ఈ జబ్బులు పోవు బాగుపడేది ఇద్దరే
డాక్టర్లు మందులషాపులు
డ్రైనేజిలు పనిచేయవు చెరువులు పూడ్చి కాంప్లెక్స్‌లు కడుతున్నారు
మరి ఆనీరు ఎక్కడికిపోతుంది రోడ్డు మీదే ఉంటుంది
యేవిఁటోరా బతుకంటే భయం వేస్తోంది మనకి ఏదో పొయ్యి కిందకి పొయ్యి మీదకి ఉంటాయి
పాపం రోజుకూలి మీద బతికేవాళ్ళ గతి ఏవిటి నిట్టూర్చేను
వాడు పగలబడి నవ్వేడు
వెర్రిదానా నారు పోసిన వాడు నీరు పోయాడా అంటారు కదా
ఇప్పుడు దేవుడు నీరు పోసేడు పాపం నారు పొయ్యడం మరిచిపోయేడు
ఎవరికైనా మరుపు సహజం
ఏవిటో మనకి అన్నిట్లోనూ దరిద్రవే కూడు గూడు నీరు మందులు డాక్టర్లు ఒకటేవిటి అన్ని దరిద్రవే
పేరు మాత్రం పవిత్ర భారతదేశం
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ