NewsOrbit
వ్యాఖ్య

మనకి జాక్ పాటా? వాళ్లకి జాక్ బూటా??

ఆ మధ్యన ఎవరో ఓ పోస్ట్ పంపించారు- వాట్సాప్ లో.

“ప్రభువుల కార్యాలయాల్లో పనిచేసే భద్రలోకులు, స్టాప్లర్ లో పిన్నులు నింపుతూ, రివాల్వర్ లో తూటాలు నింపుతున్నట్టు ఫీలైపోతూ ఉంటారు!”
నిజమే! నడిమితరగతి నలికెల పాముల సాహస కృత్యాలు ఇంతకన్నా ఘనంగా ఉండవు మరి! ఎరుపు, నలుపు గళ్ళతో, ప్రకృతిమాత తన పర్ణశాల గోడలమీద ఎర్రమట్టితో పెట్టిన ముగ్గుల్లా ఉండే ఈ నలికెల పాముల ప్రాణభయాన్ని చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వాటికి ఎందుకంత భయమో అర్థం కాదు! చివరికి చిన్న పిల్లల్ని చూసి కూడా ఉరకలు పరుగులమీద మాయమై పోతూ ఉంటాయి ఈ నలికెల పాములు. కన్ను మూసి తెరిచే లోగా నెర్రెల్లోకీ పగుళ్ళలోకీ పారిపోయే ఈ నడిమితరగతి నలికెల పాములు ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో చెప్పడం కష్టం!
ఎవర్ని ఎందుకు ప్రేమిస్తాయో, మరెవర్ని ఎందుకు ద్వేషిస్తాయో వాటికే తెలీదు!
పాపం పుణ్యం తెలీని దారే పోయే దానయ్యల పై ఉఫ్ఫ్మని ఊదిపోతాయి ఈ నలికెల పాములు. తెల్లారేసరికి ఆ అభాగ్యుడి కాళ్ళూ, చేతులూ, మొహం దిబ్బరొట్టెలా ఉబ్బిపోతాయి! ఆ నిర్భాగ్యుడు చేసిన నేరమేమిటో ఎంత బుర్రబద్దలుచేసుకున్నా అర్థం కాదు.
ఫలానీ కులంవాళ్ళంటే కొన్ని నలికెల పాములకు నచ్చదు! ఆ కులాలు చేసుకున్న పాపం ఏమిటయ్యా అని అడిగేలోగానే ఈ నలికెల పాములు ఏ నెర్రెలోకో దూరిపోతాయి. అలాగే కొన్ని మతాల వారంటే నలికెల పాములకు కిట్టదు! కొందరి తిండి అంటే కిట్టదు- మరికొందరి  వేషభాషలంటే నచ్చదు! ఇంకొందరి పూజాపునస్కారాలంటే ఈ నలికెల పాములు మెచ్చవు.
తమకు తక్షణమే జాక్ పాట్ ప్రసాదించమనీ,  తమ పక్కింటి వాళ్లకు జాక్ బూట్ దయచేయించమనీ అడగడానికి అరక్షణం కూడా సందేహించవు ఈ నలికెల పాములు! (జాక్ పాట్ అంటే కష్టపడకుండా దక్కే మహాభాగ్య”మనీ” , జాక్ బూట్ అంటే ఎంత కష్టపడినా దక్కే చెప్పుదెబ్బలనీ మీలాంటి విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పాలా? చాదస్తం కాకపోతే….) అలా ఎందుకు జరుగుతుంది? అని ఆలోచించేవాళ్లన్నా, ఎందుకు జరగనివ్వాలని నిలదీసే వాళ్ళన్నా ఈ నలికెల పాములకు బొత్తిగా సహించదు. “ఈ పృచ్ఛకులున్నారే, వీళ్ళు మంచానికి  అడ్డం, మతానికి వ్యతిరేకం!” అని విసుక్కోవడం ఈ నలికెల పాములకు అలవాటు. ఇక ఇలాంటి అన్యాయాన్ని వ్యతిరేకించి నడుంకట్టిన వాళ్ళను నలికెల పాములు క్షమించవు. తమ తాత ముత్తాతల కాలంనుంచీ ఈ న్యాయం(!) ఇలాగే అమలు జరుగుతోందని వాదిస్తారు కూడా.
ముఖ్యంగా మీడియాలో ఈ నలికెల పాముల జనాభా, ఇటీవల కాలంలో, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. టీవీల ముందు కూలబడో, టీవీ టాక్ షోస్ లో గొంతు అరగదీసుకునో ఈ నలికెల పాములు తమ జీవితాలను సార్థకం చేసుకుంటూ ఉంటాయి. వీటివల్ల బొత్తిగా ప్రయోజనం లేదనుకోవడం కూడా తప్పే! కౌచ్ పొటాటో అనే కొత్త మాట -ఇంగ్లీషులో – పుట్టుకు రావడానికి వీళ్ళే కారణం మరి! అంతకు మించి ఈ నలికెల పాములు చెయ్యగల, చేసివుండిన ఘనకార్యాలు మరేమీ లేవంటే అతిశయోక్తి కాదు! .
1975 నాటికి మన మీడియా నలికెల పాముల్లో ఎక్కువభాగం పుట్టి కూడా  ఉండకపోవచ్చు. ఎమెర్జెన్సీ ని వ్యతిరేకిస్తూ ఒక్క వాల్ పోస్టర్ ఆతికించినా, చిన్న కరపత్రం పంచినా నెలల తరబడి జైలు శిక్ష అనుభవించ వలసి వచ్చిన రోజుల్లో, ఏడు వేలమంది ప్రభుత్వాన్ని చెరిగిపోశారు. సర్కారు- అందునా ఇందిరమ్మ సర్కారు- ఊరుకుంటుందా? ఈ జర్నలిస్టుల్ని ఏళ్లతరబడి జైల్లో పెట్టింది! అయినప్పటికీ కొన్ని పత్రికల సంపాదకులు తాము నమ్మిన విశ్వాసానికి నిబద్దులై నిలబడ్డారు. అలాంటి జర్నలిస్టుల్లో ఒకరు కుల్దీప్ నయ్యర్. కిందటి ఏడాది ఆయన మరణించినప్పుడు మన ప్రధాన మంత్రి కూడా, ఆయనకు ఘన నివాళి సమర్పించారు.
బాగానే ఉంది కానీ, మన మీడియా నలికెల పాములు ఈ “జెశ్చెర్” నుంచి ఏమీ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. మన రాజ్యాంగ చట్టం లోని ఆర్టికిల్ 370 ని తొలగించడాన్ని వ్యతిరేకించిన ప్రతివారినీ దుమ్మెత్తిపోయడానికి తెగబడుతున్నాయి ఈ నలికెల పాములు. ఒక్కరుగా ఉన్నప్పుడు వొణికిచచ్చే ఈ నలికెల పాముల “శౌర్యం” మందలో చేరినప్పుడు చూడాలి! మరీ ముఖ్యంగా  ఇంటర్నెట్ గ్రూపుల్లో వీళ్ళ పరాక్రమ వైభవం చూసి తీరాల్సిందే! ఇంతకీ భావప్రకటన స్వేచ్ఛ మనకుంటే చాలని అనుకుంటున్నాయా ఈ నలికెల పాములు?  ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ పరస్పరం ఆధారపడిఉంటుందని వీళ్లకి ఎవరు చెప్తారు?

– మందలపర్తి కిషోర్

                                                                                                                8179691822

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment