ఈవిడేవిటి అస్తమానూ పాతరోజులు పాతమనుషులు అని పట్టుకు వేలాడుతుంది
ఏం వర్తమానం తెలీదా, ఇప్పుడు సమస్యలు లేవా అంటారని నాకు తెలుసు
అంచేత వర్తమానానికే వస్తాను
లేటెస్టుగా జరిగినదే చెప్తానుఇది అందరూ చదివేరు ఐతే నో రియాక్షన్
ఈనెలలో అరడజను మంది సినిమాహీరోలకి స్టంట్ చేస్తూవుంటే దెబ్బలు తగిలాయి
అంతా కుర్రాళ్లే, భవిష్యత్తు ఉన్నవాళ్లే
శర్వానంద్ కి మరీ పెద్దదెబ్బ తగిలి సర్జరీ వరకువెళ్ళింది
ఏం నాయనా ఆ స్టంట్ అంత అవసరమా
నీ చిన్నప్పుడు నువ్వు నడక నేర్చిన కొత్తలో పడిపోతే దెబ్బ తగులుతుందని మీ అమ్మ నీవెనకే తిరిగింది
చిన్న దెబ్బ తగిలినా ఆవిడ విలవిలలాడిపోయింది
మరిప్పుడు ఎంత బాధ పడుతుందో ఉహించు
అసలు ఈ స్టంట్లు లేకుండా సినిమాలు తియ్యలేరా
డూప్‌ని పెడతాం కదా అంటారు
ఆ డూప్ మాత్రం మనిషి కాదా
పాపం అతనూ డబ్బుకోసమే చేస్తాడు
దెబ్బలు తినడం సరదా కాదు
ఒక అంగుళం అటు ఇటు అయితే అతనికీ ప్రమాదమే
ఒక మనిషిని చంపడానికి కొడవళ్లు గొడ్డళ్లు పట్టుకొని అంతమంది రావాలా
ఒక బుల్లెట్ చాలదూ
ముప్పై ఏళ్ళ యువత మీద, చిన్నపిల్లల మీద సినిమా ప్రభావం చాలా ఉంటుంది
చెడుకి స్పీడ్ ఎక్కువ. ఇంత హింస చూసిన పిల్లలు ఎలా ఎదుగుతారు
హింస లేని సినిమాలు హిట్ అవలేదా
ఫిదా, ఆనంద్, శతమానం భవతి, ఎంసీఏ ఇవన్నీ హిట్లు అవలేదా
మనకి మంచికథలు లేవా లేక రాసేవాళ్ళు లేరా
లేకపోతె ఇతర భాషల నించి తెచ్చుకోండి
మంచిని కాపీ చెయ్యడం తప్పుకాదు
అసలు ప్రతి మనిషి జీవితం ఓ నవలా ప్రతి కుటుంబం ఓసినిమా
మనం చూడాలే కానీ మనముందే ఎన్నో ఉన్నాయి
ఆ మధ్య ఆఫ్రికన్ కథలు చదివేను
పేరు మారిస్తే మన కథల్లాగే ఉన్నాయిఔను మనమంతా ఆఫ్రికానుంచి వచ్చిన వాళ్ళవే కదా
అందులో ఒకతను అంటాడు too much money is very bad అని
ఔను సినిమా తీసేవాళ్ళు డబ్బుకోసవేఁ తీస్తారు
వేసేవాళ్ళు డబ్బుకోసవేఁ వేస్తారు
కానీ దానికీ ఓ నియమం ఉంది
చెడుని హింసని ప్రొమోట్ చెయ్యకూడదు
చెడు జరగడం లేదా అంటారు, జరుగుతోంది
కానీ వినడం వేరు చూడ్డం వేరు
బెటర్ లేట్ దేన్ నెవెర్
మించిపోయింది లేదు
హింస లేని సినిమాలు తియ్యండి
మంచిని పెంచండి మీకూ నష్టం లేదు జనానికి నష్టం ఉండదు
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ