NewsOrbit
రాజ‌కీయాలు

‘బిజెపికి వైసీపీ అనుకూలపక్షమే!’

విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని అన్నారు. నిన్న ఢిల్లీ పర్యటనలో సిఎం జగన్ ఎన్ అర్ సికి వ్యతిరేకమని మోడీకి, అమిత్ షాకు చెప్పొచ్చు కదా అని అన్నారు. బిజెపికి అత్యంత విశ్వాసపాత్రమైన కావలాదారు వైసిపియేనని  విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రతి ఒక్కరికి ఒక్క వాడకంగా మారిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో రాష్ట్ర ప్రయోనాలంటూ మాట్లాడారు కాని ఏం సాధించారని ప్రశ్నించారు. మండలి రద్దు రాష్ట్ర ప్రయోజనం ఎలా అవుతుందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బిజెపి చెప్పినా వారి కాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.

చేగు వీరా ‌విప్లవమని మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కనున్నారో ఆలోచించాలన్నారు. రెండు సార్లు ఢిల్లీ వెల్ళిన జగన్ ఏమి సాదించారో చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. గతంలో ఢిల్లీ లో అపాయింట్ మెంట్ ఇవ్వని వారికి ఇప్పుడు అపాయింట్ మెంట్ దొరికిందన్న ఆనందంలో ఉన్నట్టున్నారని అయన వ్యాఖ్యానించారు. రాజధాని పై తలో ప్రకటనలతో బిజెపి నాటకాలాడుతుందని విమర్శించారు. రాయలసీమలో ఉండే రాజధానిని గతంలో త్యాగం చేసామనీ, ఇప్పుడు మా రాజధాని మాకివ్వమని అడుగుతున్నామన్నారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ దినిపై మాట్లాడడం లేదన్నారు. రాయలసీమ వాసులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని అన్నారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరదం పడుతున్నారనీ, జిల్లాల పర్యటనలో పార్టీని వీడిన వారంతా వెనక్కి రావడం పార్టీ బలోపేతానికి నిదర్శనమనీ శైలజానాథ్ అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

Leave a Comment