NewsOrbit
రాజ‌కీయాలు

BJP Party: అక్కడ బీజేపీ “బండి” కదిలింది.. ఏపీలో పడుకుంది..!

BJP Party: Bandi Sanjay VS Somu Veerraaju

BJP Party: తెలంగాణాలో నాగార్జున సాగర్ దారుణ ఓటమి నుండి బీజేపీ తేరుకుంటుంది.. దుబ్బాక గెలుపు.., గ్రేటర్ గెలుపుతో ఊపెక్కిన బీజేపీ.. నాగార్జున సాగర్ లో ఊహించని దెబ్బ తిన్నది. అక్కడ ఓటమి ముందుగానే ఊహించినప్పటికీ.. ఈ తరహా ఓటమి అనుకోలేదు. అందుకే కొన్నాళ్ళు నైరాశ్యంలోకి వెళ్లి మళ్ళీ తేరుకున్నారు. రెండు, మూడు రోజుల నుండి బండి సంజయ్ దూకుడు పెంచారు. లాక్ డౌన్ వేళ కూడా కేసీఆర్ ని కంగారు పెడుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణ గవర్నర్ తమిళశైకి ఈ మెయిల్ ద్వారా వినతి పత్రం ఇచ్చారు. కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు.

BJP Party: Bandi Sanjay VS Somu Veerraaju
BJP Party Bandi Sanjay VS Somu Veerraaju

BJP Party:  కరొనతో.. కేసీఆర్ తో పోరాటం..!!

“కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రంలో కోరారు. ఈ మెయిల్ ద్వార వినతిపత్రం సమర్పించి కీలక కామెంట్స్ చేశారు. “కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్ నిర్లక్ష్యం చూపింది, ఫలితంగా పేదలకు కరోనా కష్టాలు మరింత పెరిగాయి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవు, గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటులో చికిత్స చేయించుకునేందుకు పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పుల్లో కూరుకుపోతున్నారు.
కేంద్ర పథకం ‘ఆయుష్మాన్ భారత్’లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్టు ‘ఆరోగ్య శ్రీ’ కింద ఉచితంగా కరోనా చికిత్స చేయాలి. ఏడాది కాలంగా కరోనాను ‘ఆరోగ్య శ్రీ’లో చేర్చాలన్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అంటూ మెయిల్ లో పేర్కొన్నారు.

BJP Party: Bandi Sanjay VS Somu Veerraaju
BJP Party Bandi Sanjay VS Somu Veerraaju

ఏపీలో కదలరేంటి..!?

ఏపీలో మాత్రం ప్రస్తుతం బీజేపీ ఉనికి లేదు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితం వచ్చి రెండు వారాలు కావస్తుంది. నాటి నుండి బీజేపీ నాయకులు ఎవ్వరూ మీడియా ముందుకు కానీ.., జనం ముందుకు కానీ రావడం లేదు. కనీసం ఈ మెయిల్, జూమ్ ద్వారా కూడా తమ ఉనికి చాటే ప్రయత్నం చేయడం లేదు. “ఇంకా మనం ఎన్ని చేసిన ఏపీలో పార్టీ లేవదు. అనవసరం. కేంద్రంలో అధికారంలో ఉన్నన్నాళ్ళు అనుభవించి.. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుందాం” అనే ధోరణిలోకి వెళ్లినట్టున్నారు..! పాపం ఏపీ బీజేపీ..!!

author avatar
Srinivas Manem

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!