NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

సర్వే వెవ్వేవ్వేవ్వే..అంతా బోగస్…!!

 

అమరావతి రాజధానిగా ఉండాలి అని అమరావతి ప్రాంత రైతులు, తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. అమరావతి రాజధానిగా ఉండకూడదు, మూడు రాజధానులు ఉండాలి, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండాలని వైసిపి గట్టిగా కోరుకుంటోంది. అయితే ఈ క్రమంలోనే ఎవరి మాట నెగ్గించుకోవడంలో వాళ్లు వాదనలు, ఆరోపణలు, వివాదాలు అన్నీ వినిపించుకుంటూనే పనిలో పనిగా టెక్నాలజీ జోలికి కూడా వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ వినియోగంలో కాస్త ముందు ఉంటుంది కాబట్టి అధినేత చంద్రబాబు అమరావతి కోసం ఒక సర్వే చేపట్టారు. ఆ సర్వేలో 95శాతం అమరావతే రాజధానిగా ఉండాలి అని కోరుకున్నారట. అదేమి విడ్డూరమో.

 

ఒక వేళ వైసిపి సర్వే పెడితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి

ఫర్ ఏగ్జాంపుల్ జస్ట్ ఉదాహరణకు వైసిపి ఒక సర్వే చేపట్టింది. మూడు రాజధానులకు మీరు అనుకూలమా కాదా, అమరావతే కావాలా అనే ప్రశ్నలను తయారు చేసి సర్వే చేపట్టి తమ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇచ్చి విపరీతంగా ప్రచారం చేయమని అడిగింది. ఏమవుతుంది. ఫలితం ఏమోస్తుంది. 90శాతంకు పైగా మూడు రాజధానులనే కోరుకుంటారు. ఇది సింపుల్ ట్రిక్, అందరికీ తెలిసిన వ్యవహారమే. తెలుగుదేశం పార్టీ అదే చేసింది,. ఒక సర్వేని క్రియేట్ చేసి అమరావతికి అనుకూలంగా ఉన్న సర్వేను తమ సోషల్ మీడియా ద్వారా ప్రొమోట్ చేసింది. 95శాతం ఓట్లు వస్తున్నాయంటూ దాన్నే బాకా ఊదుతూ మీడియా ముందుకు రుద్దుతోంది. ఈ రోజుల్లో ఇటువంటి సర్వేలను ఈ టెక్నాలజీని అధ్యయనాలను నమ్మేదెవరు. పట్టించుకునేదెవరు.

అసలు రాజధాని వాదన ఎన్ని జిల్లాల్లో ఉందో చూద్దాం

వైసిపికి, టిడిపికి సంబంధం లేకుండా మాట్లాడుకోవాలంటే…అ,స,లు రాజధాని విషయంలో ఆ వాదన ఎన్ని జిల్లాల్లో ఉంది. రాజధాని రాజకీయాన్ని, ఆరోపణలను, ఈ మాటలను పట్టించుకుంటున్నవారు ఎవరు, వింటున్న వారు ఎవరు అనేది సందేహమే. మాకెందుకు ఈ వాదన, మాకు ఎందుకు ఈ గొడవ, మా కెందుకీ రాజకీయాలు అని ఎవరి పని వారు చూసుకునే వారు తప్పితే మాకు ఆ రాజధాని ఉండాలి, ఈ రాజధాని ఉఁడాలి అని అనుకునేవాళ్లు చాలా తక్కువ, వైసిపి వర్గం అంతా మూడు రాజధానులు కావాలని, టిడిపి వర్గం మద్దతు దారులు అంతా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఆ పార్టీలు ఎన్ని అధ్యయనాలు, సర్వేలు క్రియేట్ చేసినా వాస్తవ అభిప్రాయం, తటస్త అభిమానుల అభిప్రాయం మాత్రం బయటకు రాదు. రాష్ట్రం మొత్తం మీద రాజధాని అమరావతి కొనసాగితే బాగుటుందని అని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కాస్త కోరుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులు జరగాలి, విశాఖ పరిపాలనా కేంద్రంగా ఉండాలి అనేది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ కొంత మేరకు ఉంటుంది. అలానే కర్నూలు న్యాయరాజధానిగా కావాలని కర్నూలు, కడప జిల్లాల్లో బాగానే కోరిక ఉంటుంది. అంటే ఇక్కడ రాజధాని వికేంద్రీకరణకు, ప్రస్తుతం ఉన్నఅమరావతికి సమ మద్దతే ఉంటుంది. అందుకే ఈ బోగస్ సర్వేలు, టెక్నాలజీ పేరుతో ఆటలు మానుకొని సహేతుకమైన విమర్శలు, ఆరోపణలు, వివాదాలతో రాజకీయాన్ని నెట్టుకొస్తే కాస్త ఆసక్తి అయినా ఉంటుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju