NewsOrbit
రాజ‌కీయాలు

‘ రేవంత్‌ను మెంటల్ దవాఖానాలో చేర్చాలి’

హైదరాబాదు, మే 1: ఇంటర్ ఫలితాలలో కేవలం అపోహలు, గందరగోళం సష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని టిఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మంగళవారం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై విమర్శలు చేయడాన్ని బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి 24గంటల్లో కెటిఆర్‌కు క్షమాపణ చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.

సున్నితమైన అంశం అని కూడా చూడకుండా ప్రతిపక్షాలు విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయని సుమన్ అన్నారు. ‘రేవంత్ రెడ్డి రాజకీయ ఒక టెర్రరిస్ట్, నాలుగు కోట్ల టెండర్‌కు వేల కోట్ల కుంభకోణం అని మాట్లాడతాడు నోట్ల కట్టలతో దొరికిన దొంగ, రేవంత్‌ను ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో చేర్చాలి’ అంటూ బాల్క సుమన్ దుయ్యబట్టారు.

హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్‌ మార్చిన కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదని బాల్క సుమన్ అన్నారు.

2017లో 4కోట్ల 30లక్షల 75వేలకు గ్లోబరీన సంస్థకు విద్యాశాఖ టెండర్ ద్వారా ఫైనల్ చేస్తే, గ్లోబరీనకు ఐటి శాఖకు సంబంధం ఏమిటని సుమన్ ప్రశ్నించారు. ఆనాడు ఐటి శాఖ మంత్రిగా కెటిఆర్ ఉన్నంత మాత్రాన విద్యాశాఖకు, ఐటి  శాఖకు లింక్ ఏలా పెడతారని సుమన్ అన్నారు.

‘ఇంటర్ ఫలితాల్లో కొంత టెక్నికల్ సమస్య వచ్చింది నిజమే. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారం చూపేందుకు కృషి చేస్తుంది’ అని సుమన్ తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా పని చేయడం లేదని సుమన్ విమర్శించారు. ఇంటర్ బోర్డులో కొంత మంది అధికారుల మధ్య విభేదాల కారణంగా గందరగోళం జరిగినట్లు తెలుస్తోందని సుమన్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలతో ఉన్నారని సుమన్ చెప్పారు. ఇంటర్ బోర్డు వ్యవహారంపై ప్రతి రోజు ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు జరుపుతున్నారని సుమన్ పేర్కొన్నారు.

ప్రతిపక్షాల ట్రాప్‌లో తల్లిదండ్రులు పడవద్దని సుమన్ హితవు పలికారు. ప్రతిపక్షాలు ప్రజల కోసం కాదు, వాళ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారని సుమన్ విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ హయాంలోనే గ్లోబరీనా, మాగ్నేటిక్ సంస్థలు మనుగడలో ఉన్నాయనీ, ఈ రెండు సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పోషించినవేనని సుమన్ పేర్కొన్నారు.

 

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Leave a Comment