పిల్లలు బడికి వెళ్ళాలి జన్మభూమికి కాదు

విజయనగరం, జనవరి2:  విభజన హామీలపై కేంద్రం స్పష్టంగానే ఉందని బిజేపి నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విభజన హామీల అమలుకు సీఎం చంద్రబాబు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే అధికంగా నిధులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రంలో జన్మభూమి కమిటీలను రాజ్యంగేతర శక్తులుగా మార్చరని కన్నా అన్నారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, మరోపక్క పట్టణాలలో జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వపాఠశాలల విద్యార్ధుల చేత ఫ్లెక్సీలు కట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలు బడిలోనే ఉండాలనీ పనులకు వేళ్ళకూడదనీ చెబుతుంటే శ్రీకాళహస్తి పట్టణంలోని పాఠశాల ఉపాధ్యాయలు మాత్రం తమ విద్యార్ధులను జన్మభూమి కార్యక్రమంలో ఫ్లెక్సీలు కట్టి కష్టపడండి అంటూ జన్మభూమి కార్యక్రమానికి పంపుతున్నారని ఆరోపించారు.