Subscribe for notification

Hyderabad Rains: అడ్డంగా ఇరుక్కున్న కేటీఆర్!టీఆరెస్ పై తిరుగుబాటు అస్త్రం!

Share

Hyderabad Rains: హైదరాబాద్ లో కురిసిన గంటన్నర వానకు దాదాపు నగరంలో రెండు వందలకు పైగా కాలనీలు వరద నీటిలో మునిగి పోయాయి. ఈదురు గాలులకు చెట్లు కూలటం మాత్రమే కాదు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్ళు.. ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు చేపట్టారు. సెలవులు కావటంతో పాటు అందుబాటులో అధికారులు లేకపోవడంతో.. విధులు నిర్వహిస్తున్న కొద్ది మంది అధికారులను జనాలు రోడ్డుమీద నిలదీస్తున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్టలో బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అత్యధికంగా సీతాఫల్ మండిలో 8.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ పరిణామంతో జిహెచ్ఎంసి జలమండలికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సమయంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం నెటిజన్లు కురిపిస్తున్నారు.

మౌలిక సదుపాయాలు అని పక్క రాష్ట్రం గురించి విమర్శించడం కాదు .. ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు బేరీజు వేసుకుని మాట్లాడాలని కొంతమంది ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అభివృద్ధి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు హైదరాబాద్ లో కురిసిన గంటన్నర వర్షానికి అడ్డంగా ఇరుక్కున్నరు అని మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఇదే తరుణంలో టిఆర్ఎస్ ప్రత్యర్థులు గంటన్నర వర్షానికి హైదరాబాద్ ఆగమాగం అయింది. అసెంబ్లీ సాక్షిగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. దాదాపు ఏడు వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాము. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదని అన్నారు. కానీ హైదరాబాద్ పరిస్థితి చూస్తే 1999, 2004, 2009..లో వరదలు వస్తే ఎలా ఉందో.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయి..ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ అదే పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

మరి కేటీఆర్ చెప్పిన అభివృద్ధి ఎక్కడ..? గంటన్నర వర్షానికి హైదరాబాద్ రోడ్లపై వరద నీరు ఇక్కడ అని వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల మౌలిక సదుపాయాల గురించి విమర్శించడం కాదు.. అసలు ఉన్న ఊరిలోనే వరదొస్తే.. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట గెలిచి రచ్చ చేయాలి. కానీ టిఆర్ఎస్ .. అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదు, చెప్పేది.. కొండంత అన్నట్టు ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ రోడ్లు డ్యామేజ్ కావడం… యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరిగిన ఘాట్ రోడ్డులు దెబ్బతినడంతో.. ప్రతిపక్షాలకు రోడ్లు.., వరద నీరు సమస్యలనీ ఎక్కుపెడుతూ టిఆర్ఎస్ పై తిరుగుబాటు అస్త్రాలను.. ప్రయోగిస్తున్నయి.


Share
sekhar

Recent Posts

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

32 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

5 hours ago