NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అంతర్వేది ఘటనపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!!

ex mp harsha kumar sensational comments on antarvedi issue

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం ఘటన ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిన విషయమే. భక్తుల దగ్గర నుంచి హైందవ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ ఈ అంశంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఘటనపై నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈ సెగ ఏపీ ప్రభుత్వాన్ని తాకింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. అధికారుల సస్పెన్షన్, దేవాదాయ శాఖతో ఇన్వెస్టిగేషన్, కొత్త రధానికి నిధులు.. ఇలా సీరియస్ గానే స్పందించింది. అయితే.. రాజకీయంగా మలుపులు తీసుకుంటున్న ఈ అంశంపై ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని ఏకంగా సీబీఐ ఎంక్వైరీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదలైంది. ఈ అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు.

ex mp harsha kumar sensational comments on antarvedi issue
ex mp harsha kumar sensational comments on antarvedi issue

హర్షకుమార్ ఏమన్నారంటే..
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజకీయ పార్టీలు స్వలాభం కోసమే విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతర్వేది రాజోలు నియోజకవర్గంలో ఉందని.. అక్కడ జనసేన రెబల్ ఎమ్మెల్యే ఉండటం వల్లే జనసేన, బీజేపీలు దీనిని రాజకీయం చేస్తున్నాయని విమర్శలు చేశారు. కాపుల్లో బలపడాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ను రంగంలోకి దించి నియోజవర్గంలో కాపుల్ని రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తత అంశాన్ని అవకాశంగా తీసుకుని మతం మీద అభిమానంతో బీజేపీ.. కులం అభిమానంతో జనసేన వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. కులాభిమానం ఎక్కువగా ఉన్న సోము వీర్రాజుకి చిరంజీవిని సీఎం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారంటూ ఎద్దేవా చేశారు.

కులానికో రకంగా వ్యవహరిస్తున్నారు..

ఇదే జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేయిస్తే ప్రభుత్వం సీబీఐతో విచారణ ఎందుకు చేయించట్లేదని ప్రశ్నించారు. కులాన్ని బట్టి సీఎం జగన్ తీరు ఉంటోందని మండిపడ్డారు. సీతానగరం శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించి సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. హర్షకుమార్ వ్యాఖ్యలతో రథం దగ్ధం అంశం రాజకీయంగా మరో మలుపు తీసుకుంటుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. రథం అంశాన్ని తీసుకుని కులం, రాజకీయం, శిరోముండనం ఘటనను తెర మీదకు తీసుకొచ్చారు. సీఎంను ఇరుకున పెట్టేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ పార్టీలన్నింటినీ దూనమాడిన హర్షకుమార్ టీడీపీపై మాత్రం ఎటువంటి విమర్శలు చేయలేదు.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N