NewsOrbit
రాజ‌కీయాలు

‘చంద్రబాబు మీటింగ్‌కు మిత్రులు డుమ్మా’

 

అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు.

ఈవిఎంల సమస్యలపై ఢిల్లీలో చంద్రబాబు మిత్ర పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంపై జివిఎల్ మాట్లాడుతూ..కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్ప మరెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదని జివిఎల్ అన్నారు.

చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం అధికారులను ఉపయోగించుకుంటున్నారని జివిఎల్ ఆరోపించారు. తనకు నచ్చిన అధికారులు లేకపోతే చంద్రబాబుకు ఓట్లు పడవని జివిఎల్ దుయ్యబట్టారు. చంద్రబాబు నిజంగా మంచి పనులు చేసి ఉంటే అధికారుల అవసరం ఎందుకని జివిఎల్ ప్రశ్నించారు.

2014లో చంద్రబాబు ఈవిఎంల గురించి ఎందుకు మాట్లాడలేదని జివిఎల్ నిలదీశారు.    మూడు కోట్ల మంది ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటేశామన్నది వివిప్యాట్‌ల ద్వారా తెలుసుకున్నారనీ, ఒక్క ఓటరైనా వివి ప్యాట్ లపై ఫిర్యాదు చేసారా? అని జివిఎల్ ప్రశ్నించారు.

ఈవిఎంలపై ఎవరికీ అనుమానం అవసరం లేదని జివిఎల్ తెలిపారు. వివి ప్యాట్ లెక్కింపు పై ఇప్పటికే సుప్రీం తగిన సూచనలు చేసిందని జివిఎల్ పేర్కొన్నారు. చంద్రబాబు తన ఓటమికి కారణం ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జివిఎల్ అన్నారు. టిడిపి ఓడిపోతుందని చంద్రబాబు ఢిల్లీలో దండోరా వేస్తున్నారని జివిఎల్ ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజకీయ సలహాదారుగా పని చేస్తున్నరని జివిఎల్ ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహించటం, ఎమ్మెల్యేలను కొనటంలో ఇంటెలిజెన్స్ పాత్ర ఉందని అందరూ అంటున్నారని జివిఎల్ చెప్పుకొచ్చారు. పోలీసు అధికారులను పొలిటికల్ మేనేజ్ మెంట్ కోసం వాడుకుంటున్నారని జివిఎల్ పేర్కొన్నారు.

ఈవిఎంల వల్ల కాదు, అవినీతి వల్లే చంద్రబాబు ఓడిపోనున్నారని జివిఎల్ అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో అనే అనుమానం ఉందని జివిఎల్ అభిప్రాయపడ్డారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Leave a Comment