NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan – నిమ్మగడ్డ వ్యూహం ముందు మళ్ళీ జగన్ ఓడారా..!?

YS Jagan .. నిమ్మగడ్డ వ్యూహం ముందు మళ్ళీ జగన్ ఓడారా.. అంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ కలసి పని చేసి పంచాయతీల అభివృద్ధికి తోడ్పడతాయి ఎక్కడైనా. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. సదూర భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణకు ఒక గుణపాఠంలా ప్రస్తుతం ఎన్నికల ప్రహసనం మారింది. సరే..! శాసన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ మధ్య పొరపొచ్చాలు వచ్చాయనుకుంటే ఓ పద్దతి. కానీ.. ఈ పోరు సీఎం వైఎస్ జగన్, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య పోరు (ఇగో)లా మారిపోయింది. రాష్ట్ర ప్రజలంతా చిత్ర విచిత్రంగా చూసిన ఎన్నికల సిత్రం ఈ పంచాయతీ ఎన్నికలు. ఏడాదిగా జరిగిన పోరాటంలో రాజ్యాంగ వ్యవస్థ విజయం సాధించింది. అక్కడితో ఆగకుండా.. జూలు విదిల్చిన సింహాంలా ఎన్నికలు జరిపిస్తోంది. ఇప్పుడు మరో విషయంలో కూడా ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్ పైచేయి సాధించింది.

nimmagadda-upper-hand-on-ys jagan-again
nimmagadda-upper-hand-on-ys jagan-again

YS Jagan : ఏకగ్రీవాలు మొదలైంది ఇలా..

పంచాయతీ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అదే.. ‘ఏకగ్రీవాలు’. గ్రామాల్లో కాబట్టి పట్టింపులు, పంతాలు, ఒకరికొకరికి తెలియడం వంటి పరిస్థితుల్లో పోరు ఎందుకని ఏకగ్రీవ ఎన్నికను తీసుకొచ్చారు. 1960లో తొలిగా రాజస్థాన్ లో ప్రారంభమైన ఈ పద్ధతి తర్వాత అనేక రాష్ట్రాల్లో అమలయ్యింది. 2001 నుంచి ఉమ్మడి ఏపీలో ఈ పద్ధతి ప్రారంభమైంది. 2013 నుంచి ఏకగ్రీవ ఎన్నికలకు ఇచ్చే మొత్తం రెట్టింపు అయింది. పోటీ లేకుండా ఎన్నికైతే గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులు అదనంగా లభించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడీ పద్ధతినే వైసీపీ ప్రభుత్వం హైలైట్ చేసింది. 2001లో కేటగిరీల ప్రకారంగా అత్యధికంగా 50వేలు ఉంటే.. 2008, 2013లో లక్షలకు పెరిగింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మరింత పారదర్శకంగా 4 కేటగిరీలుగా విభజించి 5,10,15,20 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఎన్నికల కమిషన్ పై పైచేయి సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం సంధించిన ఆఖరి అస్త్రంగా దీనిని చెప్పాలి. అయితే.. ఇక్కడ ప్రభుత్వం పాచిక పారలేదనే చెప్పాలి.

nimmagadda-upper-hand-on-ys-jagan-again
nimmagadda upper hand on ys jagan again

 

YS Jagan : ఎన్నికల కమిషన్ మాటే గెలిచిందా..

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో సంఘటనలు తప్ప పెద్దగా ప్రతికూల పరిస్థితులు ఎక్కడా జరగలేదు. అలాగే.. ప్రభుత్వం చూపించిన ఏకగ్రీవాలు కూడా అతి తక్కువ సంఖ్యలోనే జరిగాయి. అయితే అనూహ్యంగా అభ్యర్ధులంతా పోటీకి సిద్ధమవడమే ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజు ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం లక్ష నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది నిజంగా రికార్డే. ఇద్దరి మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో ఎన్నికల సంఘం మరో విజయం నమోదు చేసుకున్నట్టే. ఏకగ్రీవాల కంటే పోటీ పడటం ముఖ్యమని సూచించిన ఎన్నికల కమిషన్ మాటే చెల్లింది. గత మూడు రోజుల్లో తొలి విడత ఎన్నికలు జరిగే జిల్లాల్లో మొత్తంగా సర్పంచ్ పదవులకు 19వేల 491 నామినేషన్లు, వార్డు మెంబర్ల పదవులకు 79వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 99,290 నామినేషన్లు రావడం విశేషం. అంటే ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలకు ఎవరూ ఆశ చూపలేదనే అర్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ పై ఇక్కడైనా పైచేయి సాధించాలన్న జగన్ ప్రభుత్వం ఆశ తొలిదశలో నెరవేరలేదు. ఈ ఆఫర్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే అభ్యర్ధులు ముఖాముఖి పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

 

మలి విడతల పరిస్థితేంటో..?

ఈ ప్రహసనంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనుసరించిన విధానాలు కూడా అభ్యర్ధులు పెద్దగా ఏకగ్రీవాల వైపు దృష్టి సారించకపోవడానికి కారణం అని చెప్పొచ్చు. నిజమైన ఏకగ్రీవాలకు అభ్యంతరం లేదన్న నిమ్మగడ్డ బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం సహించమని ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే షాడో టీమ్స్ ను రంగంలోకి దింపారు. ఇందుకు ఆయన నియమించిన స్పెషల్ డీఐజీ సంజయ్ ఆయన అప్పజెప్పిన పని పూర్తి చేశారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్లు, పోలీసులు కూడా కార్య రంగంలోకి దిగి నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యేలా చేశారు. ఏకగ్రీవం కంటే పోటీ ఉంటేనే మంచిదనే నిమ్మగడ్డ వ్యాఖ్యలు అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయి. దీంతో ప్రభుత్వం పెంచి ప్రకటించిన ఏకగ్రీవ నగదు మొత్తాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మరి.. మిగిలిన మూడు విడతల్లో అయినా ప్రభుత్వ వాదన గెలుస్తుందో.. తొలి విడత స్ఫూర్తితో పోటీ పడతారో చూడాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju