NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ ఇక ఒంటరి పోరాటమే..! బీజేపీతో కటీఫ్..!?

 

రాజకీయాల్లో నిలకడ లేకపోకపోతే ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు, మాటలు, అడుగులు ఏవైనా సహేతుకమైన దారిలో లేకపోతే ప్రజల్లో చులకన భావన రావడంతో పాటు స్నేహితులు కూడా దూరంగానే జరుగుతారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఒంటరి అయినా ఫరవాలేదు. అనుకున్నది జరగాలి అనుకునే రకం. బీజెపీ గురించి తెలిసో తెలియకో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి ఆయనకు కేంద్రంలో బీజేపీ అంటే మోడీ అన్నా అమిత్ షా అన్న మమకారం. వారిపై ఉన్న అభిమానం, వారి మాట కాదనలేక రాష్ట్రంలో బీజెపీ తో కలిసి నడుస్తున్నారు, కానీ బీజేపీ రెండు నాలుకలు, ద్వంద రాజకీయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తుకుంటున్న పవన్ వారికి దూరంగా జరగాలన్న ఆలోచనలోకి వస్తున్నారుట. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, పవన్ అడుగులు కూడా బీజెపీకి నచ్చక వారు కూడా దూరంగా జరగాలి అని అనుకుంటున్నారుట. ఇలా బీజేపీకి, పవన్‌కి మధ్య ఎడమొహం పెడమొహంగా అమరావతి రాజకీయ అంశం చేరింది.

రాజధాని న్యాయ పోరాటం వెనుక..!

పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి విషయంలో మొదటి నుండి ఒక స్పష్టమైన నిర్ణయంతోనే ఉన్నారు. రాజధానిగా అమరావతి ఉండాల్సిందేనని ఈ ప్రాంత రైతులకు న్యాయం జరగాలని ఒక్క రాజధానే ఉంటే మంచిదని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామన్నారు కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, ఆరు నూరు అయినా అమరావతి ఇక్కడ నుండి తరలిపోదని ఎన్నో మాటలు చెప్పారు. తీరా రాజధాని వికేంద్రీకరణ బిల్లు తరువాత పవన్ కళ్యాణ్ కొంచెం తడబడినట్లు కనిపించినప్పటికీ అమరావతి విషయంలో ఒకే రాజధాని అనే స్టాండ్ తీసుకుని కోర్టులో న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఇదే అంశంపై బీజేపీ మాత్రం రకరకాల రాజకీయం చేస్తోంది. ఏవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ రెండు నాలుకలు, ద్వంద ధోరణిలు ప్రదర్శిస్తోంది. కేంద్రం మాత్రం జగన్ ఏది చెబితే అది చేసేందుకు సిద్ధం అవుతోంది. రాజ్యసభలో వైసీపీ అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో వైసీపీకి తోడుగా ఉండాల్సిన అవసరం కేంద్రానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ కూడా ద్వంద ధోరణిలు ప్రదర్శిస్తూ ఎన్నడూ కనీవిని రాజకీయాలను చూపిస్తుంది. వీటన్నింటినీ గమనించిన పవన్ కళ్యాణ్ బీజేపీతో ఇక వేగలేమనీ క్షేత్రస్థాయిలో కూడా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కలయిక లేదనీ తెలుసుకున్నారు.

జెండాలు వేరు..!ఎజండాలు వేరు..! ఇక దూరమే నయం..!!

రాజధాని అమరావతి విషయంలో ఇరుపార్టీల ఎజెండాలు వేరువేరుగా ఉన్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్‌కు హిందువులతో సహా మైనార్టీలు, క్రీస్టియన్‌లలో కూడా అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో కొంత ఓటు వేయాలి అన్న తత్వం ఉన్న వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు గత ఎన్నికల్లో వచ్చిన ఆరు శాతం ఓట్లలో క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు  కూడా కొంత మొత్తం ఉన్నాయి.  ఇప్పుడు బీజేపీతో కలసి నడవాలంటే మత రాజకీయాన్ని ప్రాతిపదికగా తీసుకుని హిందూ వాదాన్ని నెత్తిపై వేసుకోవాల్సిందే. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కు మైనార్టీ, క్రిస్టియన్ లు బాగా దూరం అవుతారు. అమరావతి రాజధాని అజెండా విషయంలోనూ బీజెపీతో కుదరడం లేదు. ఇలా హిందూ వాదం, రాజధాని అంశం విషయంలో పవన్, బీజేపీకి మధ్య అజెండాలు వేరువేరుగా మారాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా బీజేపీతో కలిసి పని చేయడానికి నచ్చడం లేదు. పది జండాలు ఉన్న బీజేపీ ముందు ఉంటే వంద జెండాలు ఉన్న జనసేన వెనక్కు నిలవాల్సి వస్తోంది. ఇదంతా చూసిన పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలా? పొత్తును కొనసాగించాలా? లేదా కేంద్ర పెద్దలను కలిసి బీజేపీ పెద్దలను కలిసి ఏదో విషయం తేల్చుకోవాలా? రాష్ట్రంలో బీజేపీ బాధ్యతలు మొత్తం తనకు అప్పగించేలా తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా చేయాలా అనేది పవన్ యోచిస్తున్నారుట..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju