ఆయనకు విశ్వసనీయత లేదు: రాహుల్

ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రధాని మోదికి విశ్వసనీయత లేదని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. డిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని అనే వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ ప్రధాని చెప్పేవన్నీ అబద్దాలేనని రాహుల్ దయ్యబట్టారు.

ఆంధ్రప్రధేశ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన విస్మరించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో అంతర్బాగం కాదా అని రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళితే హోదా ఇవ్వకుండా అబద్దాలు చెబుతారని రాహుల్ విమర్శించారు.