NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణాలో కుట్ర..నిజమేనా!


హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో మహాకూటమి ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి.

అటు కాంగ్రెస్, ఇటు టీడీపీకి గానీ చెప్పుకోదగ్గ సీట్లు కూడా రాలేదు. ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో తాము కూడా తలదూరుస్తామని అన్నారు. ఏపీ ఎన్నికల్లో అవసరమైతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని, తాను చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండు మూడు సార్లు ఏపీలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.

అంతేగాక, ఏపీలో పర్యటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. చంద్రబాబు పాలనపై విమర్శలు కూడా గుప్పించారు. చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తమ వర్గానికి చెందిన ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, తన ఏపీ పర్యటనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.

తలసానితో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ

తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఏపీ టీడీపీ నేత, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ అయ్యారు. తలసాని నివాసానికి వెళ్లి సమావేశమైన త్రిమూర్తులు.. ఏమి చర్చించిందీ తెలియదు. కొన్నాళ్లుగా త్రిమూర్తులు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగున్న నేపథ్యంలో తలసాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ నేపథ్యంలో త్రిమూర్తులు కూడా టీడీపీకి షాకిచ్చి వైసీపీలో చేరతారా? అనేది త్వరలోనే తేలిపోనుంది.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ‘ఏపీలో నా పర్యటన కొనసాగుతాయి. నేను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకు. నాకు ఏపీలో బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. నా నియోజకవర్గంలో ప్రచారం చేసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం’ వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క తలసాని మాత్రమే ఏపీలో పర్యటించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా ఏపీకి వస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.

చంద్రబాబు లక్ష్యంగా ఈడీ ప్రశ్నలు: రేవంత్ సంచలనం

ఓటుకు నోటు కేసు విచారణ అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగానే ఈడీ ప్రశ్నలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రెండో రోజు బుధవారం కూడా ఈడీ అధికారులు విచారించారు.

విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కేసీఆర్‌, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ ఉంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారు. మంగళవారం నుంచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారు’ అని తెలిపారు.

టీడీపీ నేతలకు కేసీఆర్ బెదిరింపులు: చంద్రబాబు

వరుసగా టీడీపీ నేతలు వైసీపీలో చేరుతుండటంతో మోదీ, జగన్మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ ఏపీపై కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నవారిని, ఎమ్మెల్యేలు, ఎంపీలను బెదిరిస్తున్నారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ బెదిరింపుల వల్లే తమ పార్టీ నేతలు వైసీపీలో చేరుతున్నారని అన్నారు.

టీఆర్ఎస్‌తో అంటకాగే వైసీపీ వాళ్లు ఏపీలో గెలిస్తే నీళ్లు కూడా రావన్నారు చంద్రబాబు. అరవై ఏళ్ల శ్రమను హైదరాబాద్‌లో వదిలేసి వచ్చామని.. విభజన తర్వాత అండగా ఉంటామన్న కేంద్రం మాట తప్పిందని చంద్రబాబు అన్నారు. తమకు సాయం చేయకపోగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలతో కలిసి ఏపీపై కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తాజాగా, సినీనటుడు నాగార్జున.. జగన్మోహన్ రెడ్డిని కలవడంపైనా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేరస్తులతో సినీనటులు ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు రాజకీయంగా మరింత వేడిని పెంచుతున్నాయి. ఎన్నికలకు మరికొంత సమయం ఉండటంతో ఇంకా ఎంత మంది నేతలు పార్టీలు మారతారో అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా జరిగే అవకాశాలున్నాయి.

author avatar
Siva Prasad

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Leave a Comment