NewsOrbit
రాజ‌కీయాలు

రేవంత్ కి వేరే పార్టీ అవసరం ఏమొచ్చింది..??

revanth reddy plans to form a new political party

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఇటివల వార్తలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా మారిన రేవంత్ కు వేరు కుంపటి పెట్టుకునే ఆలోచన ఎందుకు వచ్చినట్టు.. కాంగ్రెస్ లో వచ్చిన కష్టమేంటి.. పార్టీ పెడితే నెగ్గుకురాగలరా.. రేవంత్ చరిష్మా ఎంతవరకూ పని చేస్తుంది.. రేవంత్ వాగ్దాటి ఎలాంటి ఫలితాలనిస్తుంది.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

revanth reddy plans to form a new political party
revanth reddy plans to form a new political party

అసలు పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకంటే..

కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎవరికి వారే స్వేచ్చగా ఉంటూ తమ వాదన వినిపిస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వారందరూ సీనియర్ నాయకులే. వీహెచ్ హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క.. పార్టీని నమ్మినవారు ఉన్నారు. వీరందరిలోకి రేవంత్ రెడ్డి జూనియర్. ఆయనకు వాగ్దాటి ఎక్కువ.. శాసించడం తెలుసు.. అయినా.. రేవంత్ రెడ్డి సీనియర్లతో నెగ్గుకురాలేక పోతున్నారు. రేవంత్ స్పీడును సీనియర్లు అందుకోలేక పోతున్నారు. దీంతో రేవంత్ పై ఎంతోకొంత అసంతృప్తి గళం వినిపిస్తూ ఉంటారు. దీంతోపాటు కాంగ్రెస్ అధిష్టానంపై రేవంత్ కు కూడా నమ్మకం పోయిందని అంటున్నారు. సోనియా. రాహుల్ నాయకత్వంపై రేవంత్ కు ఆశలు లేవనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ కలిసి రావట్లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ సొంత పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. సొంతపార్టీ ఉంటే తానే శాసనకర్తగా ఉండడం.. పార్టీని తాను అనుకున్న విధంగా నడిపించడం.. చేయొచ్చని భావిస్తున్నారట.

పార్టీ పెడితే ఎలా నెగ్గుకొస్తారో..

రేవంత్ పార్టీ పెడితే కొంత తెలంగాణలో మద్దతు దక్కే అవకాశాలు ఉంటయని అంటున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 40 నుంచి 50 స్థానాల్లో రేవంత్ కు బలగం ఉందని అంటున్నారు. దీనిపై సొంత వారితో ఒక ఐటీ టీమ్ తో ఇప్పటికే సర్వే చేయించినట్టు తెలుస్తోంది. 31 జిల్లాలకు గానూ 22 జిల్లాల్లో సర్వే పూర్తైనట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో పార్టీ పెడితేనే బాగుంటుందని సర్వే వివరాలు వెల్లడైనట్టు కూడా తెలుస్తోంది. గతంలో టీడీపీ బలంగా ఉన్న కరీంనగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి,.. జిల్లాల్లో అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా రేవంత్ కు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.

author avatar
Muraliak

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju