NewsOrbit
రాజ‌కీయాలు

‘రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలే!’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాజధాని తరలింపు ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక్కరొక్కరు ఆవేదనతో మృతి చెందుతున్నారు. తాజాగా మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో కన్నుమూశారు. వీటిపై లోకేష్ నేడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..రాజధాని కోసం స్వచ్చందంగా భూమి ఇచ్చిన రైతుల్ని జగన్ చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను బలితీసుకోంటోందని అన్నారు.

శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న కొడుకు, కోడలిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడంతో రైతు అబ్బూరి అప్పారావు ఆందోళనతో మృతి చెందారనీ, మరో మహిళా రైతు సామ్రాజ్యమ్మ గుండె పోటుతో మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారణమన్నారు. చేసేవి దొంగ పనులు కాబట్టే గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులను దింపారని లోకేష్ విమర్శించారు. అసెంబ్లీకి వెళ్లడానికి ప్రజల మధ్య నుండి కాకుండా సిఎం జగన్ దొంగ దారిలో వెళ్లడానికి కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Leave a Comment