NewsOrbit
రాజ‌కీయాలు

బొబ్బిలి రాజు గారు ఏంటి ఇంత సైలెంట్ అయ్యారు..?

why sujay krishna rangarao dumb in present politics

వైకుంఠపాళి ఆట గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలకు సరదానిచ్చే ఈ ఆట పెద్దలకు జీవిత పాఠం బోధిస్తుంది. జీవితం అనే వైకుంఠపాళిలో నిచ్చెనలు అందలం ఎక్కిస్తే.. కాటేసే పాములు జీవితంపై దెబ్బ కొట్టేవిగా ఉంటాయి. ఈ వైకుంఠపాళి ఆటకు.. సరిగ్గా సరిపోయే రంగం ‘రాజకీయం’. ఎప్పుడు గెలుపు వస్తుందో, ఓటమి వస్తుందో తెలీదు. ఈ ఉదాహరణ ఎందుకంటే.. రాజకీయంగా బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వరుస విజయాల రికార్డు ఉన్న ఓ ప్రజాప్రతినిధి తాను స్వయంగా చేసిన పని స్వయంకృతాపరాధంగా మారింది. ఆయనే.. సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లాలో ఆర్ధికపుష్టి, రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. కానీ.. ప్రస్తుతం ఆయన సైలెంట్ అయిపోయారు.

why sujay krishna rangarao dumb in present politics
why sujay krishna rangarao dumb in present politics

తిరుగులేని కుటుంబ చరిత్ర..

సుజయ్ కృష్ణ తాతగారు రామకృష్ణ రంగారావు మద్రాస్ ప్రెసిడెన్సీకి రెండుసార్లు ముఖ్యమంత్రి. తండ్రి గోపాలకృష్ణ రంగారావు మూడో లోక్ సభకు ఎంపీ. వీరి వారసుడిగా సుజయ్.. బొబ్బిలి నుంచి 2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. 2017లో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మంత్రి పదవీ.. ఇచ్చారు చంద్రబాబు. అయితే.. ప్రస్తుతం ఆయన్ను పట్టించుకునే వారు లేరు. మంత్రిగా సత్తా చాటుకోలేకపోవడం, నియోజకవర్గ ప్రజలకు దూరమవడం, చంద్రబాబు తీరు.. వంటి కారణాలతో ఆయన ప్రభ కోల్పోయారు. ఇటివలే టీడీపీ కట్టబెట్టిన పదవుల్లో.. అప్పట్లో పార్టీ మారి వచ్చిన వారికి అతి తక్కువగా ఇచ్చారు. వీరిలో సుజయ్ లేరు.

అదే అతి పెద్ద తప్పిదమా..

2014లో వైసీపీ నుంచి గెలిచి 2017లో పార్టీకి రాజీనామా చేశారు. తీరా చూస్తే.. 2019లో అదే వైసీపీ అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు సొంత గూటికి వెళ్లలేక, టీడీపీలో ఉండాలో లేదో తెలీక సుజయ్ రంగారావు పరిస్థితి రాజకీయంగా అగమ్యగోచరంగా ఉంది. వ్యక్తిగత ఇమేజ్ తప్పించి రాజకీయంగా ప్రస్తుతానికి బలం లేదనే చెప్పాలి. కొత్తగా వచ్చిన వారిని చంద్రబాబు ప్రస్తుతం పట్టించుకునే స్థితిలో లేరు. ‘అప్పట్లో మంత్రి పదవే ఇచ్చాం కదా..’ అనే ధోరణి తప్పించి భరోసా ఇస్తున్న సూచనలు లేవు. మరి.. సుజయ్ కృష్ణ రంగారావు భవిష్యత్ రాజకీయ పయనం ఎటో చూడాలి.

author avatar
Muraliak

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!