NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ys Jagan x Chandrababu.. ‘పంచాయితీ’ని పంచాయతీ ఎన్నికలు ఏం తేలుస్తాయో..!?

TDP ; Municipolls Winning Analysis

Ys Jagan x Chandrababu.. మధ్య ‘పంచాయితీ’ని పంచాయతీ ఎన్నికలు ఏం తేలుస్తాయో.. అనే ఆసక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరిలోనూ నెలకొంది. నిజానికి సీఎం వైఎస్ జగన్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య ఆధిపత్యానికి నిదర్శనం ఈ ఎన్నికలు. అయితే.. మూడో పక్షంగా పక్కనుండి పర్యవేక్షిస్తోంది మాత్రం టీడీపీ. ఇప్పుడే ఎన్నికలు నిర్వహించకూడదు అనుకున్న ప్రభుత్వానికి నిర్వహించాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు నిమ్మగడ్డ. ఏటిలోకి దిగిన తర్వాత ఈత కొట్టాలి.. తప్పదు కదా..! ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ చేస్తోంది ఇదే. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను అందరినీ సిద్ధం చేశారు. అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఏకగ్రీవాల మొత్తాలను పెంచారు. పోటీ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 90 శాతం గెలుపు సాధించాలని రేఖ గీశారు.

ys jagan and chandrababu interesting fight
ys jagan and chandrababu interesting fight

Ys Jagan  ఏకగ్రీవాలు కాకుండా.. నామినేషన్లే ఎక్కువ..

ఫిబ్రవరి 9న జరిగే తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. ఊహకందని నామినేషన్లు, తిరస్కరణలు జరిగాయి. మరో రెండు రోజుల్లో ప్రచారం కూడా మొదలవుతుంది. జగన్ ఆశించింది ఏకగ్రీవ ఎన్నికలు. కానీ.. తొలి విడతలో పోటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అభ్యర్ధులు. ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు బుజ్జగింపులు పర్వం మొదలైంది. జగన్ ఆదేశించినా నామినేషన్లు ఎక్కువగా వచ్చాయంటే వైసీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉండటమే కారణం. ఈ నేపథ్యంలో జగన్ నిర్దేశించిన 90 శాతం విజయాలు కష్టపడితే కానీ దక్కే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు రెబల్స్ కూడా ఎక్కువగా ఉంటున్నారు. వీరందరినీ బుజ్జగించడం పార్టీ నేతలకు తలకు మించిన భారమే. 4వ తేదీ గురువారం సాయంత్రానికి ఎంతమంది పోటీ నుంచి ఉపసంహరించుకుంటారు అనేది వైసీపీకి కీలకంగా మారింది. జగన్ మ్యానియా పార్టీని గెలిపిస్తుందనే ధీమా పార్టీలో ఉన్నా నాయకులు ఎక్కడా అశ్రద్ధ చూపకుండా ప్రయత్నించాల్సిందే.

ys jagan and chandrababu interesting fight
ys jagan and chandrababu interesting fight

చంద్రబాబుకు కావల్సిందే ఇది..

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా పంచాయతీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో తగిలిన భారీ దెబ్బ నుంచి టీడీపీ ఇంకా కోలుకోలేదు. తెలంగాణ అనుభవంతో ఏపీలో పార్టీని కాపాడుకోవడానికే అధినేత చంద్రబాబు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు, సీఎం జగన్ పై తన స్థాయికి మించి చేస్తున్న వ్యక్తిగత దూషణలు చంద్రబాబులో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనాలు. అందుకే వైసీపీకి ఉన్న ప్రజా బలాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్టు, పట్టాభిపై దాడిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. వీటితో ఎన్నికల లబ్ది పొందాలనేది చంద్రబాబు ఆలోచన. నిజానికి ఇలాంటి వాటితోనే లబ్ది పొందడం, మీడియా అటెన్షన్ తనవైపుకు తిప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు. ఇలా జరగడమే చంద్రబాబుకు కూడా కావాలి. అందుకే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే.. ఇవన్నీ చంద్రబాబుకు లబ్ది చేకూరుస్తాయా..? అనేదే ప్రశ్న. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

అప్పుడు లేని ధైర్యం ఇప్పుడెందుకో..

నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు జరగాల్సింది 2018లో. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికలకు సుముఖంగా లేరు. అప్పటికి సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది సమయం ఉంది కూడా. అయినా.. టీడీపీకి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఆయనకు తెలిసు కాబట్టే వెనకడుగు వేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో జరిగింది కూడా ఇదే. కానీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గెలుపు తీరాల వైపు చూస్తున్నారు. నిజానికి టీడీపీపై ఉన్న వ్యతిరేకత అంత సామాన్యంగా పోయేది కాదు. అదే గ్రామాల ఓటర్లు టీడీపీ వైపు చూడకపోవడానికి అధికారంలో ఉండగా స్థానిక నాయకులు, జన్మభూమి కమిటీల తీరే. ప్రస్తుతం టీడీపీకి స్థానిక నాయకత్వం బలంగా లేదు. క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి టీడీపీ శ్రమించాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లవుతోంది. మీడియా సపోర్ట్ ఉందనే ధీమాతో ఇప్పుడే జగన్ పై వ్యతిరేక ముద్ర వేసినా టీడీపీకి వర్కౌట్ కానిది. ప్రస్తుతం సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. పంచయతీ ఓటర్లకు ఇవే కనపడే అవకాశాలు ఎక్కువ. మరి.. ఓటర్ల నాడి పట్టుకోవడం ఎవరి తరం కాదు అనే మాట కూడా ఉంది. కాబట్టి.. ఈ పంచాయతీ ఎన్నికలు ఏం చెప్తాయో చూడాల్సిందే.

author avatar
Muraliak

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!