NewsOrbit
రాజ‌కీయాలు

మోగిన ఎన్నికల నగారా

హైదరాబాదు, ఏప్రిల్ 20 : తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు శనివారం విడుదలైంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూలను ప్రకటించారు.
షెడ్యూలు ప్రకారం మూడు విడతల్లో మే ఆరవ తేదీ తొలి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని నాగిరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 539 జడ్‌పిటిసి స్థానాలు ఉండగా… ఒక స్థానానికి మాత్రం ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు. మొత్తం 538 జడ్‌పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈసారి ఆన్‌లైన్‌లో విధానంలోనూ నామినేషన్ దాఖలుచేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్ హార్డ్‌కాపీలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా జడ్‌పిటిిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీచేయవచ్చనీ, అయితే, ఫలితాల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.

40 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లోని 15 ఎంపిటిసి స్థానాలకు వచ్చే ఏడాది మే నెలలో టర్మ్ ముగుస్తుందనీ, భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపిటిసి స్థానాలకు వచ్చే ఏడాది జులైతో టర్మ్ ముగుస్తుందనీ, లీగల్ కారణాల వల్ల ములుగులోని 14 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని వివరించారు.

ఎన్నికల భద్రత కోసం 26 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు నాగిరెడ్డి తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Leave a Comment