NewsOrbit
రివ్యూలు

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` **

నిర్మాణ సంస్థ‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతిశ‌ర్మ త‌దిత‌రులు
ఆర్ట్‌:  క్రాంతి ప్రియం
సౌండ్‌:   నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
కెమెరా:  స‌న్నీ కూర‌పాటి
సంగీతం:  మార్క్ కె.రాబిన్‌
నిర్మాత‌:  రాహుల్ యాద‌వ్ న‌క్కా
ద‌ర్శ‌క‌త్వం: స‌్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె

డిటెక్టివ్ సినిమాలు చాలానే వ‌చ్చాయి. సీరియ‌స్ డిటెక్టివ్ స‌బ్జెక్టే కాదు.. కామెడీ డిటెక్టివ్ సినిమాల‌ను మ‌నం చూసి ఎంజాయ్ చేసుంటాం. 33ఏళ్ల క్రితం విడుద‌లైన `చంట‌బ్బాయ్‌` సినిమా కామెడీ డిటెక్టివ్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిందే. ఇప్పుడు అలాంటి కామెడీ డిటెక్టివ్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన సినిమానే `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`. హైద‌రాబాద్‌కు చెందిన న‌వీన్ పొలిశెట్టి స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ముంబైలో హిందీ చిత్రాల్లో న‌టించాడు. ఆయ‌న హీరోగా మారి న‌టించిన తొలి చిత్రమే `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`. మ‌రి కామెడీ తెలుగు డిటెక్టివ్ ఏ కేసును ప‌రిష్క‌రించాడు? ఎంత మేర స‌క్సెస్ సాధించాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం.

క‌థ‌:
సాయిశ్రీనివాస్ ఆత్రేయ‌(న‌వీన్ పొలిశెట్టి) ఓ ప్ర‌వేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుని కేసుల‌ను ప‌రిష్క‌రించాల‌ని చూస్తుంటాడు. అత‌ని ప్ర‌వ‌వ‌ర్త‌న చుట్టు ప‌క్క‌ల‌వారికి కామెడీగా క‌న‌ప‌డుతుంటుంది. అత‌ని ద‌గ్గ‌ర స్నేహ‌(శృతి శ‌ర్మ‌) అసిస్టెంట్‌గా జాయిన్ అవుతుంది. ఓ సంద‌ర్భంలో శ్రీనివాస్ స్నేహితుడు శిరీష్ రైలు ప‌ట్టాల ప‌క్క‌న ఈ మ‌ధ్య గుర్తు తెలియ‌ని శ‌వాలు చాలానే ప‌డి ఉన్నాయ‌ని, పోలీసుల‌కు ఈ కేసు అంతు చిక్క‌డం లేదంటూ చెబుతాడు. అలాంటి కేసును త‌న‌కు ఇవ్వ‌మ‌ని శ్రీనివాస త‌న ఫ్రెండ్‌కు చెబితే త‌ను స‌రేనంటాడు. నెల్లూరు ప‌క్క‌నే ఉన్న వెంక‌టాచ‌లం ద‌గ్గ‌ర ఓ శ‌వం ఉంద‌ని శిరీశ్ చెప్ప‌డంతో ఆత్రేయ అక్క‌డికి వెళ‌తాడు. కానీ అక్క‌డ‌కు వ‌చ్చిన పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసి జైల్లో పెడ‌తారు. కానీ జైలులో మారుతీరావు అనే ముస‌లాయ‌న త‌న కూతురు క‌నిపించ‌కుండా పోయిన రెండు రోజుల త‌ర్వాత శ‌వంగా మారింద‌ని, కానీ పోలీసులు త‌న కేసును ప‌ట్టించుకోకుండా, త‌న పైనే దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నార‌ని చెబుతాడు. ఆకేసుని టేక‌ప్ చేసిన ఆత్రేయ కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్ద‌రి వ్య‌క్తుల‌ను వెంబ‌డిస్తారు. అయితే ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఎవ‌రో చంపేస్తారు. కానీ పోలీసులు ఆత్రేయ‌నే ఆ హ‌త్య చేశాడ‌ని, అందుకు త‌గ్గ సాక్ష్యాలున్నాయ‌ని చెప్పి అరెస్ట్ చేస్తారు. బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చిన ఆత్రేయ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ పోతుంటే, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుస్తాయి. మ‌ర్డ‌ర్ కేసులో త‌న‌ను కావాల‌నే ఇరికించార‌నే సంగ‌తి కూడా అర్థ‌మ‌వుతుంది. అప్పుడు ఆత్రేయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు?  కేసును ఎలా ఛేదిస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

న‌టీన‌టుల ప‌రంగా చూస్తే .. న‌వీన్ పొలిశెట్టి టైటిల్ పాత్ర‌లో చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. ఒక ప‌క్క కామెడీ చేస్తూనే క‌థ‌ను సీరియ‌స్‌గా న‌డిపించ‌డంలోత‌ను స‌క్సెస్ అయ్యాడు. అయితే కామెడీ ఎలిమెంట్స్ ఓకే అనిపించినా, హిలేరియ‌స్‌గా మాత్రం లేవు. ఇక శృతి శ‌ర్మ డిటెక్టివ్ అసిస్టెంట్ పాత్ర‌లో డీసెంట్‌గా చ‌క్క‌గా న‌టించింది.  సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరో కేసుల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తాడు? అనే సంద‌ర్భాల్లో కామెడీని చొప్పించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. సినిమాలో ఇత‌ర పాత్ర‌ధారులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. సినిమా ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులు తీసుకుంటుంది. ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మవుతూనే ఉంటుంది. కానీ సినిమా ప్ర‌త స‌న్నివేశం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌ను ప్రెజెంట్ చేసిన తీరు బావుంది. స్క్రీన్ ప్లే బావుంది. సీరియ‌స్‌గా డిటెక్టివ్‌, ఇన్వేస్టిగేటివ్  సినిమాల పాయింట్‌ను అంతే సీరియ‌స్‌గా తీసుకుంటే బావుండున‌నిపించింది. మ‌నిషి న‌మ్మ‌కాన్ని చాలా మంది వారి స్వార్ధాల‌కు వాడుకుంటారు. అనే పాయింట్‌ను థ్రిల్లింగ్‌గా మార్చి తెర‌కెక్కించిన విధానం బావుంది. మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సన్నీ కూర‌పాటి కెమెరా ప‌నిత‌నం బావుంది.

చివ‌ర‌గా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌… కామెడీ త‌క్కువ‌.. థ్రిల్లింగ్ ఎక్కువ‌
రేటింగ్‌: 2.75/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment