Thodelu Review: సినిమా లో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడి ఎప్పటికీ ఆ సినిమాని ఆదరిస్తాడు.. అది ఏ భాషా చిత్రం అని పట్టించుకోవడం లేదు.. ఇటీవల వచ్చిన కాంతార అందుకు నిదర్శనం.. కాంతారా తరువాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన మరో చిత్రమే తోడేలు.. హిందీలో ‘బేధియా’గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..!
నాకు తెలిసిన ప్రపంచం పచ్చ నోటు మాత్రమే అనుకునే ప్రభుత్వ కాంట్రాక్టర్ భాస్కర్ (వరుణ్ ధావన్) కి.. తన అడవి జోలికి వస్తే వేటాడే క్రూర మృగం తోడేలు కి మధ్య జరిగిన అంతర్యుద్ధమే ఈ సినిమా కథ..
తోడేలు సినిమా విజువల్ ట్రీట్ అందించింది. థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ సీన్స్ తో పాటు కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ చిత్రాన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఏమిటంటే.. ఈ సినిమా నీ 3Dలోనే చూడాలి.. లేదంటే ఆ విజువల్ ట్రీట్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ మిస్ అవుతాం.. విజువల్ ట్రీట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునేవాళ్లని మాత్రం తోడేలు మంచి సర్ ప్రైజ్ కూడిన కిక్ ఇస్తుంది. డైరెక్టర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే.. యాక్టింగ్ లో ధావన్ మరో శిఖరం..
ప్రకృతి ఉంటేనే ప్రగతి అభివృద్ధి ఆర్భాటంలో మనిషి విచక్షణ కోల్పోయి అడవిని నాశనం చేస్తుంటే.. ప్రకృతి ఒడిలో పెరిగిన అడవి జంతువులు క్రూరంగా మారి నేర్పిన గుణపాటమే తోడేలు సినిమా.. రూపాలు మార్చే తోడేలు నిజంగానే ఉందా.. లేదంటే మనిషి తనకి తాను తోడేలుగా భావిస్తాడా.. అదేమైనా మానసిక పరమైన జబ్బ అనే ప్రశ్నలకు సినిమాటిక్ అండ్ విజువల్ వండరే ఈ చిత్రం..