శాంసంగ్ నుంచి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు..

ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ల‌ను త‌యారు చేసి అందించ‌డంలో శాంసంగ్ పేరుగాంచింది. ఆ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లే కాదు, ట్యాబ్‌లు కూడా యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఈ క్ర‌మంలోనే శాంసంగ్ కొత్త‌గా మ‌రో ఆండ్రాయిడ్ ట్యాబ్ ను గెలాక్సీ ట్యాబ్ ఎ7 పేరిట‌ భార‌త మార్కెట్‌లో సోమ‌వారం విడుద‌ల చేసింది. ఇందులోనూ ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

Samsung launched Galaxy Tab A7

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో.. 10.4 ఇంచుల డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది టీఎఫ్టీ డిస్‌ప్లే. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్ ఉంది. కేవ‌లం 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే ఈ ట్యాబ్ ల‌భిస్తోంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో ఇచ్చారు.

ఈ ట్యాబ్‌లో వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్ కూడా ల‌భిస్తోంది. వైఫై, 4జీ ఆప్ష‌న్ల‌లో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది. వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 5 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు. 7040 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 కు చెందిన వైఫై మోడ‌ల్ ధ‌ర రూ.17,999. ఎల్‌టీఈ మోడ‌ల్ ధ‌ర రూ.21,999గా ఉంది. అతి త్వ‌ర‌లోనే ఈ ట్యాబ్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది.