NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: మరో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సేవలూ వినియోగించుకున్న తెలంగాణ కాంగ్రెస్ .. ఎవరీ నూతన స్టాటజిస్ట్..?

Share

Telangana Congress: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ గతం కంటే మంచి జోష్ మీద ఉంది. 2018 ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే లు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార బీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఐపోయింది, అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ భావించింది. తెలంగాణలో అధికార లక్ష్యమే లక్ష్యంగా బీజేపీ ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, వర్గాలతో సతమతమవుతున్న వేళ టీపీసీసీ చీఫ్ బాధ్యతలను రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అప్పగించింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తొలుత సీనియర్ నేతలు పలువురు వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ ఆయన నేతృత్వంలో ఎన్నికల్లోకి వెళ్లాలనీ, అందరూ విభేదాలు మరిచి కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని అధిష్టానం సూచించింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు బీఆర్ఎస్, బీజేపీ నుండి అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీ వైపునకు మళ్లారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ప్రస్తుతం రాజకీయాల్లో పార్టీలకు వ్యూహకర్తల (స్ట్రాటజిస్ట్) ల సేవలం కీలకంగా మారాయి.  ఇప్పటికే ఏఐసీసీ స్ట్రాటజిస్ట్ గా సునీల్ కనుగోలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుండగా, ఆయనకు సమాంతరంగా మరో స్ట్రాటజిస్ట్ సేవలను తెలంగాణ కాంగ్రెస్ వినియోగించుకుంటోంది. గడచిన ఎనిమిది నెలలుగా ఈ స్ట్రాటజిస్ట్ ఇస్తున్న సలహాలు, సూచనలు పార్టీ నేతలు పాటిస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. రీసెంట్ గా ఆ స్ట్రాటజిస్ట్ గాంధీ భవన్ లో నిర్వహించిన మిషన్ తెలంగాణ 2023 కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ముఖ్యకార్యకర్తలకు సలహాలు, సూచనలు అందించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ప్రచార వాహనాలకు ఎలా అనుమతులు తీసుకోవాలి, ర్యాలీలు, సభలు ఎలా నిర్వహించాలి, మీటింగ్ లు ఎలా నిర్వహిస్తే మైలేజ్ వస్తుంది. ఓటరు లిస్ట్, మ్యాపింగ్, తప్పిదాలు గుర్తించడం, పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు, ఇంటింటి ప్రచారం. ఈవీఎంల తీరు పరిశీలన, పోలింగ్ ఏజెంట్ల బాధ్యతలు ఇలా అన్ని విషయాలపై అవగాహన కల్పించారు. ఇదంతా చేస్తున్నది ఎవరో కొత్త వ్యక్తి కాదు. గతంలో అంటే 2012 లో కాంగ్రెస్ పార్టీకి పార్ట్ టైమ్ స్ట్రాటజిస్ట్ గా బాధ్యతలు నిర్వహించిన హైదరాబాద్ వాసి కమ్మరి శ్రీకాంత్. ప్రస్తుతం శ్రీకాంత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి స్ట్రాటజిస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన కమ్మరి శ్రీకాంత్ డిల్లీలోనే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే సెఫాలజీ కోర్సును కూడా చేశారు. గతంలో ఢిల్లీలోనే వివధ ప్రైవేటు సంస్థలకు తన సర్వేలను అందజేశారు. ఇప్పుడు శ్రీకాంత్ తెలంగాణ కాంగ్రెస్ కు పని చేస్తూ సునీల్ కనుగోలు కు సమాంతరంగా తన రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీకి అందజేస్తున్నారు.

స్థానికుడైన శ్రీకాంత్ కు రాష్ట్ర పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను వినియోగించుకుంటోంది. ఆయన ఇచ్చే రిపోర్టులు, సర్వేలను రాష్ట్ర పార్టీ పూర్తిగా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళుతోంది.శ్రీకాంత్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో వార్ రూమ్ ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ విధానాలు, గ్యారెంటీ స్కీమ్ లను సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మందికి చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. పేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా  తదితర సోషల్ మీడియా ఫాట్ ఫారమ్ ల ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వ తప్పిదాలను జనాల్లోకి తీసుకువెళుతున్నారు. ప్రధాన సర్వేలు, కాంగ్రెస్ అగ్రనేతల స్పీచ్ లు, బీఆర్ఎస్ పై విమర్శలు ఇలా అన్ని శ్రీకాంత్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

BJP Janasena Alliance: తెలంగాణ ఎన్నికల్లో మొదటి సారి జనసేన పోటీ .. జనసేన నుండి బరిలో దిగే నేతలు వీరే ..?


Share

Related posts

Big Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ గ్యారెంటీ టాప్ ఫైవ్ లో అంటున్న తనిష్..!!

sekhar

టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

Siva Prasad

అరువు తెచ్చుకున్న బలంతో ఆంధ్రలో బిజెపి ఎదిగేనా?

Yandamuri