Brahmamudi: ఉగ్ర స్వరూపం దాల్చి ఈ ఇంటికి అదృష్ట కోడల్ని ఆయన నేను నీ రాకతో జేష్టా దేవిలా తయారయ్యాను. నువ్వు మీ ఇంటికి వెళ్లడానికి వీల్లేదు అని ఆమె అంటుంది. కానీ రాజ్ మాత్రం తనని వాళ్ళింటికి తీసుకువెళ్తాను అని అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చినా అపర్ణ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని ఇంట్లోకి కోపంగా వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న ఆ ఇంటి ఆడపడుచు మాత్రం మనసులో నాకు కావాల్సింది ఇదే నీకు నీ కొడుకు మధ్య ఆగాదం పెరగాలి అని అనుకుంటుంది. ఇక బయలుదేరండి ఇంట్లో వాళ్ళందరూ అంటారు.
రాజ్ వాళ్ళ చిన్న తమ్ముడు కనకం కి ఫోన్ చేసి మా అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాడు కావ్య వదినను మీ ఇంటికి తీసుకొస్తాడు అన్న అనగానే ఏదో జరిగిపోయింది. ఏమైపోయిందో అని అనుకుంటూ ఉంటుంది. కనకం మా అన్నయ్యకు ఒక కాంట్రాక్టు వచ్చింది అది కూడా కావ్య వాళ్ళే వచ్చిందని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందుకే మీ ఇంటికి తీసుకు వస్తున్నాడు అని చెప్పడంతో కనకం ఆనందంతో ఎగిరిపోతూ ఉంటుంది. ఆగదు ఇక ఆ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నింటిని సర్దుతుంది. ఇంటికి పట్టిన బూజు దులుపుతూ అల్లుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక తన హడావుడి చూసిన వాళ్ళ ఆయన కూడా కనకం ఎందుకు ఇలా చేస్తుంది అని అడుగుతాడు కావ్యాన్ని తీసుకొని రాజ్ ఇంటికి వస్తున్నాడని చెబుతారు.
ఇది నిజమా కాదా అని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఇక ఫాలో వదిన కూడా ఇది నిజమే అని అనడంతో కావ్యనే వాళ్ళింటి కోడలిగా ఒప్పుకున్నారంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు . అంత తేలిగ్గా వాళ్లు మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోరు ఇక్కడికి రాజ్ కావ్యని తీసుకు వస్తున్నాడు అంటేనే నాకు ఏదో అనుమానంగా ఉంది అని ఆయన అనుకుంటాడు. మరోవైపు కనకం ఇంట్లోనే సామాన్లు అన్ని సర్దుతూ ఉండగా స్వప్నకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపిస్తే వెంటనే వాటిని చెత్తబుట్టలో వేయమని అప్పుకి చెబుతుంది. స్వప్నకు సంబంధించిన ఏ వస్తువు ఇంట్లో ఉండకూడదు అని చెబుతుంది.
కావ్యని తీసుకొని తన పుట్టింటికి వెళ్తాడు. ఇక వాళ్ల అత్తయ్య చుట్టుపక్కల వాళ్ళ అందరినీ పిలిచి మా అల్లుడు మా ఇంటికి వచ్చాడు అని ఘనంగా అందరికీ చెబుతుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ కావ్య పెళ్లైన మూడు రోజుల్లోనే ఆరడుగుల భర్తని తన కొంగు తో ముడేసింది అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో రాజ్ కావ్యను తీసుకొని తన పుట్టింటికి వస్తాడు కనకం రావడంతోనే రాజ్ కి హారతి ఇస్తుంది. ఇప్పటికైనా ఇంట్లోకి రావచ్చా అని రాజ్ అనగానే రమ్మని అంటుంది. కావ్య వాళ్ళ నాన్నని చూడగానే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంటుంది. ఆయన కూడా వెంటనే కావ్యను దగ్గర తీసుకొని హత్తుకుంటాడు.