అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ అనే చక్కని టాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 10 రేటింగ్ ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది .. గతవారం ఈ సీరియల్ నాలుగవ ప్లేస్ లో ఉండగా ఈవారం మూడవ స్థానానికి ఏగబాకింది.. దేవత సీరియల్ సరికొత్త కథనంతో ఊహించని మలుపులతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ వీక్షకులను అలరిస్తోంది.. ఈ వారం రోజులు జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..
దేవినీ ఆదిత్య కు దగ్గర చేయాలని రాధ ప్రయత్నిస్తుంది. ఆదిత్య చెస్ టోర్నమెంట్ కి దేవికి ట్రైనింగ్ ఇస్తాడు.. దాంతో మాధవ్ ఎలాగైనా దేవిని ఇంటికి తీసుకు రావాలని ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. దేవిని రానని చెబుతుంది. దేవుడమ్మ దేవి తో బోనం ఎత్తిస్తున్న అని చెబుతుంది. దేవి బోనం ఎత్తి గుడికి వస్తుంది.
ఆదిత్య దేవికి దగ్గర అవుతుందన్న ఈర్ష్య తో మాధవ్ ఎలాగైనా దేవిని తన ఇంటికి తీసుకు వెళ్లాలని సత్య దగ్గర ప్లాన్ పక్కాగా అమలు చేస్తాడు.. మాధవ్ ప్లాన్ తెలియక సత్య దేవిని తనతో పాటు పంపిస్తుంది తనతో పాటు పంపించడానుకి.. మాధవ్ కుట్ర తెలుసుకున్న రాధ కోపంతో రగిలిపోతుంది.. మాధవ్ కుట్ర తిప్పికొట్టేందుకు రాధ మంచి ప్లాన్ వేస్తుంది.